జియో బిగ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ : త్వరలోరానున్నాయా?

జియో బిగ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్ : త్వరలోరానున్నాయా?
HIGHLIGHTS

US కాంట్రాక్ట్ తయారీదారు Flex తో కలిసి పనిచేయడం ద్వారా సామాన్య వినియోగదారులను మరియు వారి ధరల అంచనాలను టార్గెట్ చేసుకొని మార్కెట్ వాటాను వేగంగా విస్తరించడానికి 100 మిలియన్ స్మార్ట్ ఫోన్ బ్యాచ్ ని స్థానికంగా తయారు చేయాలని జియో వెల్లడించింది.

JioPhone2  విజయం తర్వాత, రిలయన్స్ జీయో 4G- ఎనేబుల్డ్  స్మార్ట్ ఫోనుతో అప్గ్రేడ్ చేసే ఉద్యేశ్యమున్న వినియోగదారుల అవసరాన్ని తీర్చటానికి ఒక "సరసమైన పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ "ని మార్కెట్లోకి తీసుకురావడానికి కృషిచేస్తోంది. ET ద్వారా వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఈ ఫోన్ కోసం Jio ఇతర  భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

US కాంట్రాక్ట్ తయారీదారు Flex తో కలిసి పనిచేయడం ద్వారా సామాన్య వినియోగదారులను మరియు వారి ధరల అంచనాలను టార్గెట్ చేసుకొని మార్కెట్ వాటాను వేగంగా విస్తరించడానికి 100 మిలియన్ స్మార్ట్ ఫోన్ బ్యాచ్ ని స్థానికంగా తయారు చేయాలని జియో వెల్లడించింది.

"మేము వినియోగదారులను 4G- స్మార్ట్ ఫోనుకు మళ్ళించడానికి, ఇంకా ఎక్కువ మంది వినియోగదారులకు సరసమైన పెద్ద స్క్రీన్ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చే భాగస్వాములతో పని చేయడానికి ప్రయత్నిస్తున్నాము, తద్వారా వారు ధరలకు అనుగుణంగా ఉన్న పరికరాలపై, సరైన కనెక్టివిటీని అలాగే సరైన కనెక్షన్ అనుభవాన్నిమరియు కంటెంట్ ని ఆస్వాదించవచ్చు", అని రిలయన్స్ హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ ఛానల్ డెవలప్మెంట్, సునీల్ దత్ ఎకనామిక్స్ టైమ్స్ కి చెప్పారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo