ఎయిర్టెల్-అమెజాన్ జతగా ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను విడుదల చేశాయి. అమెజాన్ భాగస్వామ్యంతో ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఈ మొబైల్ ఓన్లీ ప్లాన్ కేవలం రూ.89 రూపాయల తక్కువ ధర నుండి ప్రారంభమవుతుంది. అయితే, ఇది పరిచయ అఫర్ మాత్రమే, ఈ అఫర్ యొక్క వ్యాలిడిటీ మరియు వ్యాలిడిటీ ముగిసిన తరువాత యెంత రీఛార్జ్ చెయ్యాలి అనే విషయాలను మాత్రం ఇంకా విపులంగా తెలియపరచలేదు. ఎయిర్టెల్-అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కేవలం సింగిల్ యూజర్ కోసం అందించే మొబైల్-ఓన్లీ ప్లాన్. దీని అర్ధం ఏమిటంటే, ఒక సమయంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ఈ కంటెంట్ ను ప్లే చెయ్యగలరు. అయితే, ఈ కంటెంట్ కేవలం SD లో మాత్రమే ప్లే అవుతుంది. కానీ, మీరు కనుక HD లేదా HDR లో ప్లే కంటెంట్ ను పూర్తి Prime వీడియోలను ఆనందించాలనుకుంటే, ఎక్కువ ధర గల ప్లాన్ లను రీఛార్జ్ చేసుకోవలసి వుంటుంది.
అంతేకాదు, మొదటిసారిగా ఈ సర్వీస్ కోసం ఎయిర్టెల్ వినియోగదారులు 30 రోజుల ఉచిత ట్రయిల్ అఫర్ ను కూడా ఎంచుకోవచ్చు. దీని కోసం ఎయిర్టెల్ కస్టమర్లు AirtelThanks యాప్ నుండి అమెజాన్ కు సైన్ అప్ చెయ్యడంతో ఈ సర్వీస్ ను ఉచితంగా పొందవచ్చు. ఇక స్టార్టింగ్ ప్లాన్ 89 రుపాయల ప్లాన్ విషయానికి వస్తే, ఇది ప్రీపెయిడ్ ప్లాన్ మరియు దీనితో 6GB డేటా అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ఇక నెల సభ్యత్వంతో పాటుగా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.