ఎయిర్టెల్ WiFi జోన్ : ప్రీపెయిడ్ వినియోగదారులకి ఉచిత డేటా
500 కంటే ఎక్కవ ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందుబాటులో
టెలికం రంగంలో నానాటికి పెరుగుతున్న పోటీ కారణంగా అన్ని ప్రధాన కంపెనీలు కూడా అనేక మార్గాల ద్వారా తమ వినియోగదారులకి మంచి సేవలను అందించి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసున్నాయి. ఇందులో కొన్ని వినియోగదారులకి అంతగా ఉపయోగపడవు, కానీ కొన్ని మాత్రం వినియోగదారులకు మంచి ప్రయోజనాలను మరియు లాభాలను చేకూరుస్తాయి. ఇప్పుడు, భారతీ ఎయిర్టెల్ అందిస్తున్న WiFi జోన్ సర్వీస్ కూడా ఇలాంటిదే అనిచెప్పవచ్చు. ఎదుకంటే, ఎయిర్టెల్ ప్రస్తుతం ఈ సర్వీసు ద్వారా దాదాపుగా 500 కంటే ప్రాంతాలలోని వినియోగదారులకి ఉచితంగా డేటాని అందించనుంది.
ఎయిర్టెల్ వినియోగదారులు వారు ఎంచుకున్న ప్లాన్స్ ప్రకారంగా, వారికి ఈ సర్వీస్ అందుబాటులో ఉన్నప్పుడు దానికి కనక్ట్ చేసుకోవచ్చు మరియు ఇది పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. ఈ ఎయిర్టెల్ Wi – Fi జోన్ అనేది, కాలేజీలు ,హాస్పిటల్స్ , ఎయిర్ పోర్ట్స్ , కార్పొరేట్ ఆఫీసులు మరియు మరికొన్ని ఇతర ముఖ్యమైన ప్రాంతాలల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, దీని కనక్ట్ చెయ్యడం కూడా చాల సులభం. దీన్ని My Airtel App ద్వారా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు లేదా SSID నుండి OTP ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు.
My Airtel App లో సెర్చ్ విభాగంలో My WiFi అని ఎంటర్ చేయడంతో మీరు ఎంచుకోవచ్చు. అలాగే, ఈ సర్వీస్ ప్రస్తుతం ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నదని ఎయిర్టెల్ యొక్క వెబ్ పేజీలో వివరాలను కూడా అందించింది. ఢిల్లీ, హైదరాబాద్, కర్ణాటక, పూణే వంటి నగరాలలో ఇది ప్రస్తుతం అందుబాటులో వుంది. అయితే, మీకు ఈ అన్లిమిటెడ్ కాంబో ప్యాకేజీతో ఒక 10GB ని అందిస్తారు. మీ My Airtel App లో ఈ డేటా గురించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.