Airtel BlueJeans లాంచ్ : జియోమీట్, Zoom , మైక్రోసాఫ్ట్ టీమ్స్ , గూగుల్ Meet కి పోటీగా వచ్చింది

Airtel BlueJeans లాంచ్  : జియోమీట్, Zoom , మైక్రోసాఫ్ట్ టీమ్స్ , గూగుల్ Meet కి పోటీగా వచ్చింది
HIGHLIGHTS

ప్రస్తుతం కొనసాగుతూన్నవీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం విభాగంలో Airtel BlueJeans లాంచ్ ఎయిర్టెల్ కూడా పోటీకి దిగింది.

Airtel కొత్తగా లాంచ్ చేసిన ఎయిర్టెల్ బ్లూ జీన్స్ ఎలా ఉపయోగించాలి

ఇది జియోమీట్, Zoom , మైక్రోసాఫ్ట్ టీమ్స్ , గూగుల్ Meet కి పోటీగా, ఎయిర్టెల్ తీసుకొచ్చిన ఎయిర్టెల్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం.

ఇంటి నుండి పనిచేసేవారి సంఖ్య అధికంగా పెరగడంతో, వారికీ అవసరమైన ఒక సర్వీస్ కోసం డిమాండ్ పెరిగింది అదే –  వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం . Zoom , మైక్రోసాఫ్ట్ Teams , గూగుల్ Meet  మరియు ఇటువంటి మరిన్ని యాప్స్,  ఇంటి నుండి పనిచేసే వారు తమ కార్యకలాపాలను ఒక గ్రూప్ కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో, ఆ సంస్థలు వాటిపైన ఎక్కువ శ్రద్ధ వస్తున్నాయి.

వీడియో కాన్ఫరెన్సింగ్ విభాగంలో తాజాగా ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోమీట్, వినియోగదారులకు మరియు సంస్థ వినియోగదారులకు ఒకే విధంగా అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడు ఎయిర్టెల్ వెరిజోన్‌తో భాగస్వామ్యం చేసుకుని Airtel BlueJeans ‌ను భారత్‌కు తీసుకువచ్చింది.

Airtel BlueJeans ఎయిర్టెల్ బ్లూ జీన్స్ ఎలా ఉపయోగించాలి ?

ఎయిర్టెల్ బ్లూ జీన్స్ అనేది ఎంటర్ప్రైజ్-గ్రేడ్ వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్. అయితే,  ఇది సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ విభాగంలో జూమ్, గూగుల్ మీట్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ మరియు మరిన్నింటితో ఇది పోటీపడుతుంది. ఎయిర్టెల్ బ్లూజీన్స్, ప్రారంభంలో ఉచిత ట్రయల్‌గా లభిస్తుంది. వినియోగదారులు ఎయిర్టెల్ వెబ్ ‌సైట్ ‌లో నమోదు చేసుకోవాలి మరియు రిజిస్ట్రేషన్ చేసిన 24 గంటల తర్వాత, ఈ సర్వీస్ ఎనేబుల్ అవుతుంది.

ఎయిర్టెల్ బ్లూజీన్స్ మరియు రిలయన్స్ జియోమీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్ మధ్య అంతరం

ఆసక్తి ఉన్నవారు బ్లూజీన్స్‌ను నేరుగా యాక్సెస్ చేయవచ్చు కాని ఈ సేవతో కలిగే ప్రయోజనాలను కోల్పోతారు. ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారం దానితో రియల్ -టైం మీటింగ్స్ విశ్లేషణలు మరియు ప్రత్యక్ష సమావేశ నియంత్రణలు వంటి లక్షణాలను తెస్తుంది. వినియోగదారులు ఒక్కో కాల్‌కు రూ .0.50 చొప్పున చెల్లించాల్సి  వుంటుంది.

ఎయిర్టెల్ బ్లూజీన్స్ డెస్క్టాప్ మరియు మొబైల్ అంతటా పని చేస్తుంది. ఈ సర్వీస్, ఎంటర్ప్రైజ్-గ్రేడ్ సెక్యూరిటీతో కూడా వస్తుంది. ఈ సర్వీస్ అందించే మరో ముఖ్య లక్షణం డేటా లోకలైజేషన్. భారతదేశంలో, తమ డేటా స్టోరేజ్ చేయాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. భద్రత కోసం, ఎయిర్టెల్ బ్లూజీన్స్ AES-256 GCM ఎన్క్రిప్షన్ అందిస్తుంది. కాన్ఫెరెన్స్ లో ఎవరు ప్రవేశించవచ్చో కంట్రోల్ నియంత్రణలతో కూడిన వెయిటింగ్ రూమ్‌ను ఇది అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo