ఎయిర్టెల్: OTT, డేటా, కాలింగ్ మరిన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్.!
ఎయిర్టెల్ యూజర్లకు OTT, డేటా, కాలింగ్ మరిన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తన పోర్ట్ ఫోలియోకు జత చేసింది
ఈ ప్లాన్ తో ఉచిత 5G డేట్ వినియోగం కూడా యూజర్లు అనందించవచ్చు
ఎయిర్టెల్ యూజర్లకు OTT, డేటా, కాలింగ్ మరిన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్స్ అందించింది. ప్రస్తుత ఆన్లైన్ అవసరాలు మరియు OTT ట్రెండ్ ను దృష్టిలో వుంచులోని ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తన పోర్ట్ ఫోలియోకు జత చేసింది. ఈ ప్లాన్ తో ఉచిత 5G డేట్ వినియోగం కూడా యూజర్లు అనందించవచ్చు. యూజర్ల కోసం ఎయిర్టెల్ అందించిన ఈ బెస్ట్ ప్లాన్స్ పైన ఒక లుక్కేద్దామా.
ఎయిర్టెల్ రూ. 699 ప్లాన్
ఎయిర్టెల్ రూ. 699 ప్లాన్ యూజర్లకు ఆల్ రౌండ్ ప్రయోజాలను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ తో ఈ వ్యాలిడిటీ కాలానికి గాను Amazon Prime Video సబ్ స్క్రిప్షన్, డైలీ 3GB 4G డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS లిమిట్ ను అందుకుంటారు. ఈ ప్లాన్ తో Xtream APP యాక్సెస్, Wynk Music, 3 నెలల అపోలో 24/7 మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన రూ. 100 క్యాష్ బ్యాక్ ను కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న ఏరియాలో అన్లిమిటెడ్ 5G లాభాన్ని కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్ రూ. 839 & 999 ప్లాన్స్
ఈ రెండు ప్లాన్స్ కూడాఆల్ రౌండ్ లాభాలను అందిస్తాయి. ఈ రెండు ప్లాన్స్ 84 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటాయి. అయితే, రూ. 839 ప్లాన్ డైలీ 2GB 4G డేటా 3నెలల Disney+ Hotstar మొబైల్ సబ్ స్క్రిప్షన్ అందిస్తే, రూ. 999 ప్లాన్ 3GB 4G డేటాని Amazon Prime Video సబ్ స్క్రిప్షన్ ని అందిస్తుంది.
ఈ రెండు ప్లాన్స్ అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100SMS వినియోగం, Xtream APP యాక్సెస్, Wynk Music, 3 నెలల అపోలో 24/7 మరియు ఫాస్ట్ ట్యాగ్ పైన రూ. 100 క్యాష్ బ్యాక్ వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.