ఎయిర్టెల్ 7000 కోట్ల డీల్ తో jio కి దెబ్బ
అదే ఎయిర్టెల్ telenor విలీనం ,ఎయిర్‌టెల్ రూ.7000 కోట్ల డీల్ ఓకే చేసింది
jio ని దెబ్బతీయటానికి దాని క్రేజ్ తగ్గించటానికి ఎయిర్టెల్ చేయని ప్రయత్నం లేదు , కానీ ఎన్ని ఆఫర్లు రిలీస్ చేసిన jio ను దాటలేకపోతోంది. అందుకేనేమో ఒక భారీ సంచలనానికి తెరలేపనుంది . అదే ఎయిర్టెల్ telenor విలీనం ,ఎయిర్‌టెల్ రూ.7000 కోట్ల డీల్ ఓకే చేసింది.ఈ డీల్ ప్రకారం టెలినార్ భారతీ ఎయిర్‌టెల్‌లో ఒకటవుతాయి. సో దానిద్వారాగా ఎయిర్‌టెల్ అతి పెద్ద నెట్‌వర్క్ గా ఎదగాలని ఒక కొత్త ప్లాన్ వేసింది. అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్‌టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి తెచ్చుకోవాలని యోచన . టెలినార్ కి సంభందించి ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లనుమొత్తం కొనేసి , రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్‌టెల్ చూస్తుందని సమాచారం. దీనిపై ఎయిర్‍టెల్ గురువారం ఫైనలైజ్ చేసింది. చూద్దాం ఏమవుతుందో .