Airtel Plan: రూ. 49 ప్లాన్ పైన మరిన్ని ప్రయోజనాలు జత చేసిన ఎయిర్టెల్.!

Airtel Plan: రూ. 49 ప్లాన్ పైన మరిన్ని ప్రయోజనాలు జత చేసిన ఎయిర్టెల్.!
HIGHLIGHTS

ఎయిర్టెల్ యొక్క బెస్ట్ బడ్జెట్ డేటా ప్లాన్

రూ. 49 డేటా ప్లాన్ కు మరిన్ని ప్రయోజనాలను చేర్చింది

రోజంతా అన్లిమిటెడ్ డేటా ఆనందాన్ని పొందవచ్చు

Airtel Plan: ఎయిర్టెల్ యొక్క బెస్ట్ బడ్జెట్ డేటా ప్లాన్ పైన మరిన్ని ప్రయోజనాలను జత చేసింది. దేశంలోని టెలికం కంపెనీల మధ్య కొనసాగుతున్న కాంపిటీషన్ ను తట్టుకునేందుకు వీలుగా కొత్త ప్లాన్ లను ఎయిర్టెల్ తీసుకు వస్తోంది. ఇది మాత్రమే కాదు కస్టమర్లు మెచ్చిన జనరంజక ప్రీపెయిడ్ ప్లాన్ లలో కొన్నింటికి మరిన్ని ప్రయోజనాలను కూడా జత చేస్తోంది. ఇదే దారిలో బెస్ట్ బడ్జెట్ డేటా ప్లాన్ గా వెలుగొందుతున్న రూ. 49 డేటా ప్లాన్ కు మరిన్ని ప్రయోజనాలను చేర్చింది.

Airtel Plan:

ఎయిర్టెల్ యొక్క రూ. 49 డేటా ప్లాన్ తో ఇప్పుడు ఒకరోజు మొత్తం అన్లిమిటెడ్ డేటా సౌకర్యం అందుతుంది. అయితే, ప్లాన్ పైన 20 GB హై స్పీడ్ డేటా క్యాప్ ఉంటుంది. కానీ, 64 Kbps స్పీడ్ తో రోజంతా అన్లిమిటెడ్ డేటా ఆనందాన్ని పొందవచ్చు. ఈ డేటా ప్రీపెయిడ్ ప్లాన్ ఒక్కరోజు చెల్లుబాటుతో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో ఎటువంటి కాలింగ్ లేదా SMS ప్రయోజనాలు మాత్రం లభించవు.

Also Read: 5G Phone: 10 వేల బడ్జెట్ లో కొత్త 5G స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా.!

ఒక్కరోజు కోసం అన్లిమిటెడ్ డేటా ఆనందాన్ని కొరుకునే యూజర్లు ఈ రూ. 49 డేటా ప్లాన్ తో అందించవచ్చు. ఇటివంటి ప్రయోజనాన్ని రెండు రోజుల వ్యాలిడిటీ అందించే మరొక ప్లాన్ వుంది. అదే ఎయిర్టెల్ యొక్క రూ. 99 రూపాయల డేటా ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కూడా 20GB హై స్పీడ్ డేటాని అందిస్తుంది. ఈ లిమిట్ ముగిసిన తరువాత కూడా 64 Kbps స్పీడ్ తో రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ డేటాని అందించవచ్చు.

ఈ రూ. 99 ప్లాన్ కొద కేవలం డేటా ప్లాన్ మాత్రమే కాబట్టి, కాలింగ్ లేదా SMS వంటి ఇతర ప్రయోజనాలు వర్తించవు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo