కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం ఎక్కువ లాభాలతో కొత్త ప్లాన్ ఒకటి లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తో 15 GB డేటా మరియు 15 OTT యాక్సెస్ వంటి లాభాలను యూజర్లకు ఎయిర్టెల్ అఫర్ చేస్తోంది. అదే, ఎయిర్టెల్ యొక్క రూ.148 రూపాయల ప్లాన్ మరియు ఈ ప్లాన్ డేటాతో పాటుగా OTT లాభాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న అన్ని బెనిఫిట్స్ మరియు ఇదే ధరలో వచ్చే మరొక ప్లాన్ గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం.
ఎయిర్టెల్ యొక్క ఈ రూ.148 ప్లాన్ ను మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బేస్ ప్లాన్ తో జట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ రీఛార్జ్ తో మీకు 15 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 28 రోజుల ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీనిద్వారా, SonyLiv, Lionsgate Play, ఫ్యాన్ కోడ్, Eros Now, Hoichoi, మనోరమమ్యాక్స్ మరియు మరిన్ని OTT లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ మీ బేసిక్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది.
ఈ ప్లాన్ కూడా బేసిక్ ప్లాన్ తో జత చేసే డేటా ప్లాన్ మరియు ప్రస్తుతం ఉన్న బేసిక్ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ప్లాన్ తో 30 రోజుల ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. కానీ, ఈ ప్లాన్ తో డేటా మాత్రం కేవలం 1GB మాత్రమే లభిస్తుంది.