15GB డేటా మరియు 15 OTT ఉచిత యాక్సెస్ తో కొత్త ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!

15GB డేటా మరియు 15 OTT ఉచిత యాక్సెస్ తో కొత్త ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!
HIGHLIGHTS

ఎయిర్టెల్ తన యూజర్ల కోసం ఎక్కువ లాభాలతో కొత్త ప్లాన్ ఒకటి లాంచ్ చేసింది

ఈ ప్లాన్ తో 15 GB డేటా మరియు 15 OTT యాక్సెస్ అఫర్ చేస్తోంది

ఈ ప్లాన్ డేటాతో పాటుగా OTT లాభాలను కూడా అందిస్తుంది

కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం ఎక్కువ లాభాలతో కొత్త ప్లాన్ ఒకటి లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తో 15 GB డేటా మరియు 15 OTT యాక్సెస్ వంటి లాభాలను యూజర్లకు ఎయిర్టెల్ అఫర్ చేస్తోంది. అదే, ఎయిర్టెల్ యొక్క రూ.148 రూపాయల ప్లాన్ మరియు ఈ ప్లాన్ డేటాతో పాటుగా OTT లాభాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న అన్ని బెనిఫిట్స్ మరియు ఇదే ధరలో వచ్చే మరొక ప్లాన్ గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం. 

ఎయిర్టెల్ రూ. 148 ప్లాన్:

ఎయిర్టెల్ యొక్క ఈ రూ.148 ప్లాన్ ను మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బేస్ ప్లాన్ తో జట్ చేసుకోవాలి. ఈ ప్లాన్ రీఛార్జ్ తో మీకు 15 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంతేకాదు,  ఈ ప్లాన్ తో 28 రోజుల ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీనిద్వారా,  SonyLiv, Lionsgate Play, ఫ్యాన్ కోడ్, Eros Now, Hoichoi, మనోరమమ్యాక్స్ మరియు మరిన్ని OTT లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ మీ బేసిక్ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది. 

 ఎయిర్టెల్ రూ. 149 ప్లాన్

ఈ ప్లాన్ కూడా బేసిక్ ప్లాన్ తో జత చేసే డేటా ప్లాన్ మరియు ప్రస్తుతం ఉన్న బేసిక్ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి వర్తిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, ప్లాన్ తో 30 రోజుల ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. కానీ, ఈ ప్లాన్ తో డేటా మాత్రం కేవలం 1GB మాత్రమే లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo