Airtel Plans: రేట్లు పెరిగిన తర్వాత కూడా Amazon Prime తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!

Airtel Plans: రేట్లు పెరిగిన తర్వాత కూడా Amazon Prime తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ఇవే.!
HIGHLIGHTS

Amazon Prime తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది

OTT తో వచ్చే రెండు బెస్ట్ బడ్జెట్ ప్లాన్ లను ఎయిర్టెల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది

20 ఉచిత OTT లతో కూడిన ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే ను కూడా ఈ ప్లాన్స్ అందిస్తాయి

Airtel Plans: ఈ నెల ప్రారంభం నుంచి ఎయిర్టెల్ తో సహా అన్ని టెలికాం కంపెనీలు కూడా టారిఫ్ రేట్లు పెంచాయి. పెరిగిన రేట్లు తో యూజర్లు వారి మొబైల్ నెంబర్ రీఛార్జ్ కోసం 20% వరకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే, రేట్లు పెరిగిన తరువాత కూడా ప్రముఖ OTT అయిన Amazon Prime తో వచ్చే బెస్ట్ ప్లాన్స్ ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. మరి ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్లాన్స్ ఏమిటో తెలుసుకుందామా.

Airtel Plans

టారిఫ్ రేట్లు పెరిగిన తర్వాత కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ తో జతగా వచ్చే రెండు బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను ఎయిర్టెల్ తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఇందులో, ఎయిర్టెల్ యొక్క రూ. 838 మరియు రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.

ఎయిర్టెల్ రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ తో 56 రోజులు పాటు డైలీ 3GB హై స్పీడ్ డేటా, డైలీ 100SMS వినియోగ ప్రయోజనం మరియు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాలు అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 56 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, అన్లిమిటెడ్ 5జి డేటా, 20 ఉచిత OTT లతో కూడిన ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే, 3 నెలల అపోలో 24/7 మెంబర్ షిప్ ,మరియు Wynk మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తుంది.

Airtel Plans With Amazon Prime membership

ఎయిర్టెల్ రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్

ఇక ఎయిర్టెల్ రూ. 1,199 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ తీసుకువస్తుంది. ఈ ప్లాన్ లాంగ్ వ్యాలిడిటీ తో 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB స్పీడ్ డేటా, డైలీ 100SMS వినియోగం వంటి ప్రయోజనాలు తీసుకొస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ తో 84 రోజుల అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ లభిస్తుంది.

Also Read: Google Pixel 9 Series: భారీ కెమెరా సెటప్ తో ఆగస్టు 14 న లాంచ్ కి సిద్ధం.!

పైన తెలిపిన ప్రయోజనాలు కాకుండా ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ ప్లే (20 ఉచిత OTT లు), అన్లిమిటెడ్ 5జి డేటా మరియు 3 నెలల అపోలో 24/7 మెంబర్ షిప్ ప్రయోజనాలు కూడా తీసుకు వస్తుంది.

మొబైల్ రీఛార్జ్ లేదా ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo