Airtel Plan: తక్కువ ఖర్చుతో 365 రోజులు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!
![Airtel Plan: తక్కువ ఖర్చుతో 365 రోజులు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.! Airtel Plan: తక్కువ ఖర్చుతో 365 రోజులు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చిన ఎయిర్టెల్.!](https://static.digit.in/Airtel-Plan-that-offers-unlimited-calling-under-budget.jpg)
తక్కువ ఖర్చుతో 365 రోజులు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 2 వేల కంటే తక్కువ ఖర్చులోనే లభిస్తుంది
ఈ కొత్త అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి
Airtel Plan: ఎయిర్టెల్ యూజర్ల కోసం తక్కువ ఖర్చుతో 365 రోజులు కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ను ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 2 వేల రూపాయల కంటే తక్కువ ఖర్చులోనే లభిస్తుంది మరియు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలు అందిస్తుంది. ఈ కొత్త అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి తెలుసుకోండి.
Airtel Plan:
ఎయిర్టెల్ కొత్తగా తీసుకు వచ్చిన వాయిస్ ఓన్లీ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,849 ప్లాన్ బడ్జెట్ అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ గా ఇప్పుడు నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను ముందుగా అధిక ధరలో అందించినా, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాలతో ఈ ప్లాన్ రేటు మరింత తగ్గించింది. వాస్తవానికి, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశాల తర్వాతే తీసుకు వచ్చింది. అయితే, ఈ ప్లాన్ తో డేటా అవసరం లేని యూజర్లుకు అనవసరంగా డేటా కోసం డబ్బు చెల్లించే అవసరం ఉండదు.
Also Read: AIWA Soundbar పై గొప్ప డిస్కౌంట్ ప్రకటించిన Flipkart
ఎయిర్టెల్ రూ. 1,849
ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు, అంటే పూర్తిగా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, ఈ వన్ ఇయర్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ తో 3600 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.
ఈ ఎయిర్టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరో రెండు అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అవేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు మూడు నెలల Apollo 24|7 మెంబర్ షిప్ ఉచితంగా అందిస్తుంది. ఇది కాకుండా Free Hello Tunes ను కూడా ఆఫర్ చేస్తుంది.
మరిన్ని ఎయిర్టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here