Airtel యూజర్లకు తీపి కబురు: 3నెలల యూట్యూబ్ ప్రీమియం ఉచితం

Updated on 05-Nov-2020
HIGHLIGHTS

ఎయిర్‌టెల్ మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం యొక్క ఉచిత ట్రయల్‌ ను అందిస్తోంది.

ఈ అవకాశం కేవలం ఎంచుకున్న కస్టమర్లకు మాత్రమే

ట్రయల్ ప్రమోషన్ లో భాగంగా ఎయిర్టెల్ వినియోగదారుల కోసం అఫర్.

ఎయిర్‌టెల్ మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం యొక్క ఉచిత ట్రయల్‌ ను అందిస్తోంది. అయితే, ఈ అవకాశం కేవలం ఎంచుకున్న కస్టమర్లకు మాత్రమే ట్రయల్ ప్రమోషన్ లో భాగంగా ఎయిర్టెల్ వినియోగదారుల కోసం అఫర్ చేస్తోంది. యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వానికి భారతదేశంలో రూ .129 ఖర్చవుతుంది, అయితే ఈ ఆఫర్ కింద ఎయిర్‌టెల్ వినియోగదారులు దీన్ని ఉచితంగా పొందవచ్చు. ఇది ఏప్రిల్ 22 వరకు చెల్లుతుంది, దీని కింద వినియోగదారులు మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియంకు కాంప్లిమెంటరీ యాక్సెస్ పొందవచ్చు.

మార్గదర్శకాల ప్రకారం, యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఆఫర్ ఎవరికి చెల్లదంటే, ప్రస్తుత యూట్యూబ్ ప్రీమియం చందాదారులకు మరియు గతంలో యూట్యూబ్ ట్రయల్స్ కోసం ఎంచుకున్న వినియోగదారులకు చెల్లదు. అంతేకాకుండా, ఇంతకుముందు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం లేదా గూగుల్ ప్లే మ్యూజిక్ కోసం సైన్ అప్ చేసి ఉన్నాలేదా ప్రస్తుతం ఉపయోగిస్తుంటే, ఈ ఎయిర్టెల్ ఆఫర్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ యొక్క నాన్-మ్యూజిక్ ఫీచర్లను మాత్రమే అందిస్తుంది.

ఎయిర్‌టెల్ వినియోగదారులు 3 నెలల ఉచిత యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఎలా పొందవచ్చు?

ఈ యూట్యూబ్ ప్రీమియం కాంప్లిమెంటరీ చందా ఆఫర్ ఏప్రిల్ 21, 2021 వరకు అందుబాటులో వుంటుంది. ఇక్కడ ఎయిర్టెల్ వినియోగదారులు మూడు నెలల ట్రయల్ వ్యవధి కోసం యూట్యూబ్ ప్రీమియానికి ఉచిత కాంప్లిమెంటరీ చందాను పొందవచ్చు. యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వం కింద, ఎయిర్‌టెల్ వినియోగదారులు బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ యాక్సెస్ వంటి ఫీచర్లతో పాటు ఎటువంటి ప్రకటనలు ఉండనటువంటి యూట్యూబ్ యాక్సెస్‌ను అందుకుంటారు.

ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్‌ ఫోన్ల కోసం అందుబాటులో ఉన్న Airtel Thanks యాప్ కి లాగిన్ అవ్వడం ద్వారా ఎయిర్‌టెల్ యూజర్లు ఈ ఆఫర్ కోసం వారికి అర్హత ఉన్నది లేక లేదో తనిఖీ చేయవచ్చు. ఈ అఫర్ కేవలం ఎంచుకున్న వినియోగదారకు మాత్రమే అందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఎయిర్టెల్ తన చందాదారుల కోసం కాంప్లిమెంటరీ చందా కోసం ట్రయల్ కోడ్ కోసం అభ్యర్థించడానికి ఒక ఫారమ్ ని కూడా విడుదల చేసింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :