కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ నుండి తమ వినియోగదారులకు సరైన ప్రయోజనాలతో మంచి ప్లాన్స్ అన్ని సంస్థలు ఇవ్వడానికి చూస్తున్నాయి. ఇదే దారిలో, ఎయిర్టెల్ తన యూజర్ల కోసం డేటా , కాలింగ్ మరియు SMS బెనిఫిట్స్ తో పాటుగా, ఎంటర్టైన్మెంట్ ని కూడా ఇస్తోంది. ఇప్పుడు కొత్తగా వినియోగదారుల కోసం డబుల్ డేటా ఆఫర్ ప్రకటించింది.
ఎయిర్టెల్ ఇప్పుడు తన రూ .98 డేటా యాడ్-ఆన్ ప్యాక్ నుండి ఈ డబుల్ డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్యాక్ ఇప్పుడు 6GB డేటాకు బదులుగా 12GB డేటాతో వస్తుంది. ఎయిర్‌టెల్ 98 ప్రీపెయిడ్ చెల్లుబాటు 28 రోజులు మరియు ఇది డేటా ప్యాక్ అయినందున ఈ ప్లాన్ ఎటువంటి కాల్ లేదా SMS ప్రయోజనాలను అందించదు. ముఖ్యంగా, రిలయన్స్ జియో మరియు వొడాఫోన్ వంటి ఇతర టెలికాం సంస్థలు కూడా ఇటువంటి డేటా యాడ్-ఆన్ ప్యాక్ లను అందిస్తున్నాయి.
ఇక ఇతర బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ విషయానికి వస్తే, ఎయిర్టెల్ రూ .99 ప్రీపెయిడ్ ప్లాన్ 18 రోజుల వాలిడిటీతో వస్తుంది మరియు అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ మరియు మొత్తం 1 జిబి డేటాను అందిస్తుంది. అలాగే, రూ .129 ప్లాన్ అపరిమిత కాలింగ్ ఇస్తుంది మరియు 24 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ లో మొత్తం 300 SMS మరియు 1GB డేటా చేర్చబడింది. ఇక ఎయిర్టెల్ రూ. 199 ప్లాన్ గురించి చూస్తే, ఇది 24 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది రోజుకు 1GB డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMS అందిస్తుంది.