ఎయిర్టెల్ తన కస్టమర్లకు అతిపెద్ద షాకిచ్చింది. ఇండియాలో అతిపెద్ద టెలికం సంస్థలలో ఒకటైన ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్స్ టారిఫ్ రేట్లను పంచుతున్నట్లు ప్రకటించింది. అంటే, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క రీఛార్జ్ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడిందింది. ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్స్ పైన టారిఫ్ రేట్లను 25 శాతం వరకు పెంచింది. వాస్తవానికి, ముందుగా పోస్ట్ పైడ్ ప్లాన్స్ పైన టారిఫ్ రేట్లను పెంచిన ఎయిర్టెల్ ఇప్పుడు ప్రీపెయిడ్ ప్లాన్స్ యొక్క రీఛార్జ్ రేట్లను కూడా పెంచింది. ఎయిర్టెల్ యొక్క కొత్త టారిఫ్ రేట్స్ నవంబర్ 26 నుండి అమలులోకి వస్తాయి.
నవంబర్ 26 నుండి ఎయిర్టెల్ యొక్క పెరిగిన టారిఫ్ లు అమలులోకి వస్తే రీఛార్జ్ ల పైన 25 శాతం అధికంగా చెలించవలసి వస్తుంది. అంటే, Airtel యొక్క 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం 79 రూపాయల ప్రారంభ ధరలో వస్తుండగా, పెరిగిన 25 శాతం జత చేస్తే నవంబర్ 26 తరువాత 99 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది.
ఇక బడ్జెట్ వినియోగదారులకు ప్రీతిపాత్రమైన 149 అన్లిమిటెడ్ ప్లాన్ రీఛార్జ్ కోసం 179 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే, 56 రోజుల ప్లాన్ రూ.449 ప్లాన్ కోసం రూ.549, రూ.379 రూపాయల క్వార్ట్రర్లి ప్లాన్ (84 రోజుల) కోసం రూ.455 చల్లించాల్సి వస్తుంది. ఇక సంవత్సరం (365 రోజులు) వ్యాలిడిటీ ప్లాన్ కోసం అయితే ఏకంగా 501 రూపాయలు అధనంగా పే చేయవలసి వస్తుంది.
అంటే, ఎయిర్టెల్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ప్లాన్ రూ.2,498 రూపాయల ప్లాన్ కోసం ను రూ.2,999 మొత్తాన్ని చెల్లించాలి. ఎయిర్టెల్ యొక్క ఈ కొత్త టారిఫ్ రేట్స్ నవంబర్ 26 నుండి అమలులోకి వస్తాయి. అయితే, ఇతర కాంపిటీటర్ టెలికం కంపెనీలైన జియో మరియు వోడాఫోన్ ఐడియా తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచడం గురించి మాట్లాడలేదు. కానీ, త్వరలోనే ఈ సంస్థలు కూడా వారి టారిఫ్ రేట్స్ పెంచవచ్చని ఊహిస్తున్నారు.
ఎయిర్టెల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.