Netflix OTT సబ్ స్క్రిప్షన్ ఉచితంగా కావాలా, అయితే, ఈ ఎయిర్టెల్ ప్లాన్ పై ఒక లుక్కేయండి. ఎందుకంటే, ప్రముఖ టెలికాం Airtel తన యూజర్ల కోసం గొప్ప ప్రయోజనాలతో కొత్త ప్లాన్ ను లాంచ్ చేసింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను ఎంటర్టైన్మెంట్ కేటగిరి నుంచి అందించింది. ఈ కొత్త ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు మరిన్ని లాభాలు అందిస్తుంది.
ఎయిర్టెల్ లేటెస్ట్ గా ప్రకటించిన రూ. 1,499 లాంగ్ వ్యాలిడిటీ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు మరిన్ని ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది. ఈ ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు వివరంగా చూద్దామా.
Also Read: Realme GT 6T: స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 తో ఇండియా లాంచ్ కన్ఫర్మ్.!
ఎయిర్టెల్ రూ. 1,499 ప్లాన్ తో డేటా, కాలింగ్ మరియు OTT బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ టోటల్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ 84 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ను పొందుతారు. అంతేకాదు, 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటా లేదంటే 4G నెట్ వర్క్ పైన రోజుకు 3GB హై స్పీడ్ కూడా లభిస్తుంది. అంటే, 84 రోజులకు టోటల్ 252 GB ల డేటాని ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అందుకుంటారు. దీనితో పాటుగా ప్రతి రోజు 100 SMS ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు లభించే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 84 నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీనీతో పాటు Apollo 24|7 మూడు నెలల సబ్ మెంబర్ షిప్ కూడా వస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో Wynk Music మరియు Free Hello Tunes ని కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది.
సింపుల్ గా చెప్పాలంటే, ఈ ప్లాన్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలతో వస్తుంది.