ఎయిర్టెల్ యొక్క కొత్త రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల : ఒకటే ప్లాన్ లాభాలెన్నో
కేవలం ఈ ప్లానుతో రీచార్జి చేయడం ద్వారా అనేకమైన లాభాలను అందిస్తోంది.
ఎయిర్టెల్, ఈ మధ్యకాలంలో రిలయన్స్ జియోకి పోటీగా అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. అవన్నీ ఒక ఎత్తైతే, ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో సరికొత్తగా తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఒక ఎత్తని చెప్పొచ్చు. ఎందుకంటే, కేవలం ఈ ప్లానుతో రీచార్జి చేయడం ద్వారా అనేకమైన లాభాలను అందిస్తోంది. ఎయిర్టెల్ మరియు అమేజాన్ ప్రైమ్ భాగస్వామ్యంతో తీసుకొచ్చిన ఈ ప్లాన్, అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్స్ మరియు ప్రైమ్ వీడియోలకు కూడా 28 రోజుల వరకు సబ్ స్క్రిప్షన్ అందుతుంది. అంటే, డేటాతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కూడా ఈ ప్లానుతో అందుకుంటారు.
ఈ ప్లాన్, రూ. 299 రూపాయల ధరతో ప్రారంభించబడింది మరియు వినియోగదారులకి రోజువారీ 2.5GB డేటా, అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 SMS లు కూడా లభిస్తాయి మరియు వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ యాక్సెస్ ను 28 రోజుల కోసం అందుకుంటారు. అంటే, అమేజాన్ ప్రైమ్ నుండి అన్లిమిటెడ్ HD కంటెంట్ (సినిమాలు, వీడియోలు, ప్రోగ్రాములు) చూడడానికి సరిపడినంత డేటా ఈ ప్లానుతో అందిస్తున్నదని చెప్పొచ్చు.
అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ ను AirTiltLanks ఆప్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్ని రిటైల్, ఎయిర్టెల్ స్టోర్లు, ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు, www.airtel.in మరియు AirTiltLanks అప్లికేషన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు Amazon.in మరియు అమెజాన్ పే ద్వారా ఈ ప్యాక్ యాక్టివేట్ చేయవచ్చు.