ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం భారీ లాభాలతో రెండు కొత్త ప్లాన్స్ ప్రకటించింది. అధిక డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఒక నెల ఉచిత సభ్యత్వం వంటి లాభాలను పూర్తి నెలరోజుల వ్యాలిడిటీతో ఈ కొత్త ప్లాన్స్ ను తీసుకువచ్చింది. ఈ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను రూ.296 మరియు రూ.319 రూపాయల ధరలో ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్ కూడా మీకు అదనపు బెనిఫిట్స్ తో వస్తాయి. ఈ రెండు సరికొత్త ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూద్దామా.
ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 25GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.
ఎయిర్టెల్ రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి నెల రోజుల (30 లేదా 31 రోజులు) వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 2GB హై స్పీడ్ డేటాని తీసుకువస్తుంది. అలాగే, అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అధనంగా, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఉచిత ట్రయల్ ను కూడా పొందవచ్చు. వీటితో పాటుగా ఉచిత హలో ట్యూన్స్, Wynk Music, FASTag పైన 100 రూపాయల క్యాష్ బ్యాక్ వంటి అదనపు లాభాలను కూడా ఈ ప్లాన్ రీఛార్జ్ తో కస్టమర్లు పొందుతారు.
ఈ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఒక చిన్న తేడా వుంది. అదేమిటంటే, ఎయిర్టెల్ రూ.296 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తే, ఎయిర్టెల్ రూ.319 ప్లాన్ మాత్రం నెలలో వుండే రోజులతో సంభంధం లేకుండా పూర్తి నెలరోజుల చెల్లుబాటుతో వస్తుంది. అర్ధమయ్యేలా చెప్పాలంటే, ఈ నెల ఏ తేదికి మీరు రీఛార్జ్ చేస్తారో వచ్చే నెల ఆ తేదీ వరకు చెల్లుబాటు అవుతుంది.
మరిన్ని బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం Click Here