టెలికం కంపెనీల మద్య ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ అగ్గి రాజుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే కాబోలు అన్ని టెలికం కంపెనీలు కూడా ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ లను షబ్ స్క్రిప్షన్ లను జత చేస్తూ కొత్త కొత్త ప్లాన్ లను ప్రకటిస్తున్నాయి. ఇదే దారిలో, Airtel ఇప్పుడు తన యూజర్లకు మంచి ప్రయోజనాలతో పాటుగా ఉచిత Netflix సబ్ స్క్రిప్షన్ తో కొత్త ప్లాన్ తెచ్చింది. ముందుగా Disney+ Hotstar సబ్ స్క్రిప్షన్ తో ఎంటర్టైన్మెంట్ ప్లాన్ లను తీసుకు వచ్చిన ఎయిర్టెల్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ను కూడా తన ప్లాన్ లకు జత చేసింది.
ఎయిర్టెల్ కొత్తగా రూ.1,499 ప్రీపెయిడ్ ప్లాన్ ను ఉచిత నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తో లాంచ్ చేసింది. ఈ ప్లాన్ తో కేవలం నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ మాత్రమే కాకుండా అన్లిమిటెడ్ లాభాలను అందిస్తోంది. ఎయిర్టెల్ యొక్క కొత్త రూ. 1,499 ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను వివరంగా చూద్దాం.
Also Read : Instagram: కొత్త ఫీచర్ తో మరింత సౌకర్యం..ఏమిటా ఫీచర్ అంటే.!
ఎయిర్టెల్ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5G నెట్ వర్క్ పైన అన్లిమిటెడ్ 5జి డేటాని అందిస్తుంది. అయితే, 4G నెట్ వర్క్ పైన రోజుకు 3GB ల 4G డేటా చొప్పున మొత్తం 252 GB ల డేటాని కూడా తీసుకు వస్తుంది. అలాగే, రోజుకి 100 SMS ల ప్రయోజనాన్ని కూడా తీసుకు వస్తుంది. ఈ ప్లాన్ తో నెట్ ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ఎయిర్టెల్ ఉచితంగా అందిస్తోంది.
ఇది మాత్రమే ఈ ప్లాన్ తో మరిన్ని ఇతర లాభాలను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను ఈ ప్లాన్ తో Free Hello ట్యూన్స్, 3 నెలల అపోలో 24|7 సర్కిల్ మరియు Free Wynik మ్యూజిక్ ను యాక్సెస్ కూడా అందిస్తుంది.