విశాఖలో మొదలైన Airtel 5G Plus సేవలు: మీ ఫోన్ ఒక్కసారి చెక్ చేసుకోండి.!

Updated on 28-Jan-2023
HIGHLIGHTS

విశాఖలో Airetl 5G Plus సేవలు అందుబాటులోకి

తెలుగు రాష్టాల్లోని రెండు ప్రధాన నగరాల్లో 5G సర్వీస్ లను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది

ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు

ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 నగరాల్లో తన 5G సర్వీస్ లను మొదలుపెట్టిన ఎయిర్టెల్, 18 నగరంగా వైజాగ్ ను లిస్ట్ చేసింది. అంటే, విశాఖలో Airetl 5G Plus సేవలు ఎయిర్టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో, తెలుగు రాష్టాల్లోని రెండు ప్రధాన నగరాల్లో 5G సర్వీస్ లను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. ముందుగా హైదరాబాద్ లో 5G సర్వీస్ లను ప్రారంభించించిన ఎయిర్టెల్ ఇప్పుడు వైజాగ్ ను కూడా 5G నగరాల లిస్ట్ లో చేర్చింది.

అయితే, ప్రస్తుతానికి నగరంలోని కొన్ని ప్రాంతాలలోనే ఎయిర్టెల్ 5G ప్లస్ సర్వీస్ అందుటులోకి తీసుకోచ్చింది. కానీ, త్వరలోనే నగరమంతటా 5G సర్వీస్ విస్తరిస్తుందని, ఎయిర్టెల్ తెలిపింది. ప్రస్తుతం, పూర్ణా మార్కెట్, బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్, MVP కాలనీ, డాబా గార్డెన్స్ మరియు ద్వారకా నగర్ తో సహా మరిన్ని ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్టెల్ సూచించింది. అలాగే, త్వరలోనే అన్ని ప్రాంతాలకు ఈ సర్వీస్ లను విస్తరించనున్నట్లు కూడా తెలిపింది.

మీరు ఎయిర్టెల్ 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :