ఎయిర్టెల్ నుండి Wynk Premium తో రెండు కొత్త యాడ్ ఆన్ ప్యాక్స్ ప్రకటన

Updated on 26-Jan-2021
HIGHLIGHTS

ఎయిర్టెల్ తన పోర్ట్ ఫోలియోకి రెండు కొత్త Add-On ప్లాన్స్ ని జోడించింది

వినియోగదారుల డిమాండ్లకు సరిపోయేవిధంగా రెండు ప్లాన్స్

ఉచిత Wynk సబ్ స్క్రిప్షన్స్ మరియు మరిన్ని లాభాలు

ఎయిర్టెల్ తన పోర్ట్ ఫోలియోకి రెండు కొత్త Add-On ప్లాన్స్ ని జోడించింది. ప్రస్తుతం టెలికం రంగంలో నెలకొన్న పోటీకి తగిన విధంగా ఈ ప్లాన్ లను ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్ కూడా వినియోగదారుల డిమాండ్లకు సరిపోయేవిధంగా తీసుకొచ్చినట్లు సంస్థ పేర్కొంది. కొత్తగా తీసుకువచ్చిన ఈ రెండు ప్లాన్స్ లో ఇకటి 78 రూపాయల ధరలో మరియు రెండవ ప్లాన్ ను 248 రూపాయల ధరలో ప్రకటించింది.

ఈ రెండు ప్లాన్స్ తీసుకొచ్చే ప్రయోజనాల విషయానికి వస్తే, రూ.78 రూపాయాల ప్లాన్ 5GB హై స్పీడ్ డేటాతో పాటుగా 30 రోజుల Wink Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. అయితే, ఇది యాడ్ ఆన్ ప్లాన్ కాబట్టి ప్లాన్ యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ వరకూ వుంటుంది. ఇక రూ.248 ప్లాన్ 25GB హై స్పీడ్ డేటాతో వస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో పూర్తిగా ఒక సంవత్సరం Wink Premium సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా మీ యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీ వరకూ వర్తిస్తుంది.

ఇప్పటికే అందుబాటులో వున్న ఎయిర్టెల్ యొక్క మరొక అద్భుతమైన యాడ్ ప్యాక్ కూడా వుంది. ఈ ప్లాన్ రూ.131 రూపాయల ధరలో వస్తుంది మరియు మంచి లాభాలను అందింస్తుంది. ఈ ప్లాన్ కేవలం 100MB డేటాని మాత్రమే అందిస్తుంది. కానీ, ఈ ప్లాన్ తో పూర్తిగా ఒక నెల ఉచిత Amazon Prime సబ్ స్క్రిప్షన్, ఉచిత Wink Music సబ్ స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్ మరియు Airtel Xstream కి కూడా ఉచిత సబ్ స్క్రిప్షన్ ని అందిస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :