Airtel IPTV launched and know the plan prices and features
Airtel IPTV సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. అదేనండి, ఇంటర్నెట్ పై టెలివిజన్ సర్వీస్ లను అందించే “ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్” ను ఇప్పుడు ఎయిర్టెల్ అందించింది. ఈ కొత్త సర్వీసులు దేశంలోని చాలా ప్రధాన నగరాలు మొదలుకొని 2000 కు పైగా పట్టణాల్లో అందుబాటులోకి తెస్తుంది. ఈ సిరీస్ ను ఎంచుకున్న యూజర్లకు ఇంటర్నెట్ ద్వారా అంతరాయం లేని టీవీ సర్వీస్ ను అందిస్తుంది. ఇది DTH మరియు OTT రెండు సర్వీస్ లను ఒకే చోట అందిస్తుంది మరియు నెట్ ద్వారా పని చేస్తుంది.
ఈ ఎయిర్టెల్ ఐపిటీవీ సర్వీస్ కోసం ప్లాన్స్ రీఛార్జ్ చేసిన యూజర్లు ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే, యూజర్లను ఆకర్షించడానికి ఎయిర్టెల్ 30 రోజుల ఉచిత సర్వీస్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ సర్వీస్ కోసం ఆఫర్ చేస్తున్న ప్లాన్ తో రీచార్జ్ చేసుకునే యూజర్లకు దాదాపు 600 టీవీ చానెల్స్ మరియు Netflix, Prime Video, Apple Tv Plus వంటి 29 OTT యాప్స్ యాక్సెస్ కూడా అందిస్తుంది.
Also Read: Best 1.5 Ton AC Deals: 30 వేల బడ్జెట్ లో 1.5 టన్ ఏసీ కోసం కోరుకునే వారి కోసం బెస్ట్ డీల్స్.!
ఎయిర్టెల్ ఆఫర్స్ చేస్తున్న ఈ ఐపిటీవీ ప్లాన్స్ ను Wi-Fi స్పీడ్ తో జత అందిస్తోంది. ఇందులో స్పీడ్ ను ప్లాన్ రేట్లు సెట్ చేసింది.
మొదటిది రూ. 699 ప్లాన్ : ఇది ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్లాన్. ఈ ప్లాన్ 350 టీవీ ఛానల్స్ మరియు 26 స్ట్రీమింగ్ యాప్స్ యాక్సెస్ తో పాటు 40 Mbps వైఫై స్పీడ్ అందిస్తుంది.
రెండవది రూ. 899 ప్లాన్ : ఈ ప్లాన్ 350 టీవీ ఛానల్స్ మరియు 26 స్ట్రీమింగ్ యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది . ఈ ప్లాన్ 100 Mbps వైఫై వేగం అందిస్తుంది.
మూడో ప్లాన్ రూ. 1,099 ప్లాన్ : ఈ ప్లాన్ 200 Mbps స్పీడ్ తో వైఫై ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 350 టీవీ ఛానల్స్ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో 29 స్ట్రీమింగ్ యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది.
నాల్గవ ప్లాన్ రూ. 1,599: ఈ ప్లాన్ 300 Mbps వేగంతో తో వైఫై అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 29 స్ట్రీమింగ్ యాప్స్ మరియు 350 టీవీ ఛానల్స్ ఆఫర్ చేస్తుంది.
ఐదో ప్లాన్ రూ. 3,999 : ఈ ప్లాన్ ఏకంగా 1 Gbps వేగంతో వైఫై అందిస్తుంది. ఈ ప్లాన్ తో Netflix, Prime Video, Apple Tv Plus తో సహా 29 స్ట్రీమింగ్ యాప్స్ యాక్సెస్ మరియు 350 టీవీ ఛానల్స్ కూడా అందిస్తుంది.