Airtel IPTV సర్వీస్ లాంచ్ చేసిన ఎయిర్టెల్: ప్లాన్ రేట్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Airtel IPTV సర్వీస్ లాంచ్ చేసిన ఎయిర్టెల్: ప్లాన్ రేట్లు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

Airtel IPTV సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేసింది

ప్రధాన నగరాలు మొదలుకొని 2000 కు పైగా పట్టణాల్లో అందుబాటులోకి తెస్తుంది

యూజర్లకు ఇంటర్నెట్ ద్వారా అంతరాయం లేని టీవీ సర్వీస్ ను అందిస్తుంది

Airtel IPTV సర్వీసులను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. అదేనండి, ఇంటర్నెట్ పై టెలివిజన్ సర్వీస్ లను అందించే “ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్” ను ఇప్పుడు ఎయిర్టెల్ అందించింది. ఈ కొత్త సర్వీసులు దేశంలోని చాలా ప్రధాన నగరాలు మొదలుకొని 2000 కు పైగా పట్టణాల్లో అందుబాటులోకి తెస్తుంది. ఈ సిరీస్ ను ఎంచుకున్న యూజర్లకు ఇంటర్నెట్ ద్వారా అంతరాయం లేని టీవీ సర్వీస్ ను అందిస్తుంది. ఇది DTH మరియు OTT రెండు సర్వీస్ లను ఒకే చోట అందిస్తుంది మరియు నెట్ ద్వారా పని చేస్తుంది.

Airtel IPTV : ఎవరు చూడవచ్చు?

ఈ ఎయిర్టెల్ ఐపిటీవీ సర్వీస్ కోసం ప్లాన్స్ రీఛార్జ్ చేసిన యూజర్లు ఈ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే, యూజర్లను ఆకర్షించడానికి ఎయిర్టెల్ 30 రోజుల ఉచిత సర్వీస్ ఆఫర్ ను కూడా అందించింది. ఈ సర్వీస్ కోసం ఆఫర్ చేస్తున్న ప్లాన్ తో రీచార్జ్ చేసుకునే యూజర్లకు దాదాపు 600 టీవీ చానెల్స్ మరియు Netflix, Prime Video, Apple Tv Plus వంటి 29 OTT యాప్స్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

Also Read: Best 1.5 Ton AC Deals: 30 వేల బడ్జెట్ లో 1.5 టన్ ఏసీ కోసం కోరుకునే వారి కోసం బెస్ట్ డీల్స్.!

Airtel IPTV ప్లాన్స్ ఏమిటి?

ఎయిర్టెల్ ఆఫర్స్ చేస్తున్న ఈ ఐపిటీవీ ప్లాన్స్ ను Wi-Fi స్పీడ్ తో జత అందిస్తోంది. ఇందులో స్పీడ్ ను ప్లాన్ రేట్లు సెట్ చేసింది.

మొదటిది రూ. 699 ప్లాన్ : ఇది ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్లాన్. ఈ ప్లాన్ 350 టీవీ ఛానల్స్ మరియు 26 స్ట్రీమింగ్ యాప్స్ యాక్సెస్ తో పాటు 40 Mbps వైఫై స్పీడ్ అందిస్తుంది.

Airtel IPTV

రెండవది రూ. 899 ప్లాన్ : ఈ ప్లాన్ 350 టీవీ ఛానల్స్ మరియు 26 స్ట్రీమింగ్ యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది . ఈ ప్లాన్ 100 Mbps వైఫై వేగం అందిస్తుంది.

మూడో ప్లాన్ రూ. 1,099 ప్లాన్ : ఈ ప్లాన్ 200 Mbps స్పీడ్ తో వైఫై ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 350 టీవీ ఛానల్స్ అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో 29 స్ట్రీమింగ్ యాప్స్ కి యాక్సెస్ అందిస్తుంది.

నాల్గవ ప్లాన్ రూ. 1,599: ఈ ప్లాన్ 300 Mbps వేగంతో తో వైఫై అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా 29 స్ట్రీమింగ్ యాప్స్ మరియు 350 టీవీ ఛానల్స్ ఆఫర్ చేస్తుంది.

ఐదో ప్లాన్ రూ. 3,999 : ఈ ప్లాన్ ఏకంగా 1 Gbps వేగంతో వైఫై అందిస్తుంది. ఈ ప్లాన్ తో Netflix, Prime Video, Apple Tv Plus తో సహా 29 స్ట్రీమింగ్ యాప్స్ యాక్సెస్ మరియు 350 టీవీ ఛానల్స్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo