Airtel: టెలికాం రంగంలో కొనసాగుతున్న పోటీని మరింత పెంచే కొత్త ప్రకటన చేసింది ఎయిర్టెల్. యూజర్లను ఆకర్షించేలా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకు వస్తున్న ఎయిర్టెల్, ఇప్పుడు రూ. 395 ప్లాన్ పై 14 రోజుల అధిక వ్యాలిడిటీని కూడా అనౌన్స్ చేసింది. కొత్తగా జత చేసిన వ్యాలీటీడీతో ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక లాభాలను అందించే బెస్ట్ ఎయిర్టెల్ ప్లాన్ ల లిస్ట్ లోకి చేరింది.
రీసెంట్ గా, ఎయిర్టెల్ రూ. 395 ప్లాన్ ప్రీపెయిడ్ ప్లాన్ ని 56 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్టెల్ ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 14 రోజుల అధిక వ్యాలిడిటీని కూడా జత చేసింది. ఈ కొత్త పరిణామంతో ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 70 రోజుల వ్యాలిడిటీని యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం.
ఎయిర్టెల్ రూ. 395 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు మొత్తంగా 70 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 70 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని అందుకుంటారు. అయితే, ఈ ప్లాన్ తో లిమిటెడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ తో టోటల్ వ్యాలిడిటీ కాలానికి కేవలం 6GB హై స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత 1MB డేటా కోసం 50 పైసలు ఖర్చు అవుతుంది.
ఈ ప్లాన్ తో 70 వ్యాలిడిటీ కాలానికి 600 SMS ల ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ లిమిట్ ముగిసిన తర్వాత 1 SMS (లోకల్ Rs. 1 మరియు STD కోసం Rs. 1.5) రేట్లు వర్తిస్తాయి. అయితే, పైన తెలిపిన కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలతో పాటు మూడు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Also Read: Realme NARZO N63: భారీ ఆఫర్లతో రియల్ మీ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!
ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 3 నెలల Apollo 24/7 సర్కిల్ మెంబర్ షిప్, ఉచిత హలో ట్యూన్స్ మరియు Wynk Music ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అధిక వ్యాలిడిటీని తక్కువ ధరలో కోరుకునే వారికి ఈ ప్లాన్ తగిన ఆప్షన్ గా ఈ ప్లాన్ ఇప్పుడు చెప్పబడుతుంది.