టెలికాం రంగంలో రోజురోజు కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్న ఎయిర్టెల్, దాని భారీ ప్లాన్స్ మరియు పోస్ట్పెయిడ్ ప్రణాళికల్లో ప్రధాన మార్పులు చేయడం ద్వారా తన సబ్ స్క్రైబర్లను పెంచుకుంటోంది. ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పుడు తన పోస్ట్పెయిడ్ ప్రణాళికలను పూర్తిగా మార్చివేసింది మరియు ఇప్పుడు వేర్వేరు ధరలలో వేర్వేరు బోనసులను వినియోగదారులకు అందిస్తోంది. ఎయిర్టెల్ కొత్తగా తన ప్రీపెయిడ్ ప్లాన్స్ తో అమెజాన్ ప్రైమ్ ఆఫర్ను ప్రవేశపెట్టింది, మరియు సంస్థ ఎయిర్టెల్ 4G హాట్స్పాట్ ప్లాన్లలో కూడా భారీగానే మార్పులు చేసింది.
4G హాట్ స్పాట్ డిమాండ్ కారణంగా, రిలయన్స్ జీయో మరియు భారతి ఎయిర్టెల్ కూడా వాటి ప్లానలను అదే ధరలలో విడుదల చేసాయి. కొన్ని నెలల క్రితం రిలయన్స్ జ్యోఫీ, ఎయిర్టెల్ 4 జి హాట్ స్పాట్ కోసం 999 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు వినియోగదారులు కేవలం 399 రూపాయల ధరతో ఎయిర్టెల్ 4G హాట్ స్పాట్ ను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్టెల్ దాని అధికారిక వెబ్సైట్లో, ఎయిర్టెల్ 4G హాట్ స్పాట్ ను ఒకే ప్లానుతో జాబితా చేసింది, ఇది రూ. 399 ధరకే చూపెడుతోంది. ఈ ప్రణాళికలో, వినియోగదారులు నెలకు 50GB డేటాను ఉపయోగించుకోవచ్చు మరియు డేటా లిమిట్ తర్వాత, ఇంటర్నెట్ వేగం 80 Kbps కి తగ్గించబడుతుంది.
ముందుగా వినియోగదారులు ఈ ప్లాన్ కోసం, 999 రూపాయలను చెల్లించాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు అటువంటి అవసరంలేదు. నెలకు యూజర్లు Wi-Fi హాట్ స్పాట్ పరికరానికి రూ. 399 ధరతో ఉపయోగించవచ్చు.
Huawei భాగస్వామ్యంతో ఈ హాట్ స్పాట్ పరికరం రూపొందించబడింది మరియు దీని ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ఎయిర్టెల్ వినియోగదారులు కూడా Wi-Fi హాట్ స్పాట్ తో ఒకే సమయంలో 10 పరికరాలకు కనెక్ట్ కూడా చేయవచ్చు. ఈ పరికరానికి 1,500 mAh బ్యాటరీ ఉంటుంది, ఇది బ్యాటరీని ఆరు గంటల వరకు బ్యాకప్ చేస్తుంది.