ఎయిర్టెల్ తన వినియోగదారుకు ఎక్కువ ప్రయోజనాలను అందించేలా చాలా ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు మరొక శుభవార్త కూడా ఎయిర్టెల్ కస్టమర్ల కోసం ప్రకటించింది. అయితే, ఇది కొన్ని ప్రాంతాల వారికీ మాత్రమే శుభవార్త అని చెప్పవచ్చు. అదేమిటంటే, ఎక్కువ ప్రయోజనాలను తక్కువ ధరలో అందించేలా ఎయిర్టెల్ కొన్ని సర్కిళ్లలో మాత్రేమే ప్రకటించిన మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ ను ఇప్పుడు మరిన్ని సర్కిళ్లకు విస్తరించినట్లు తెలిసింది. ఈ ప్లాన్స్ లో, రూ .99 ప్లాన్, రూ .129 ప్లాన్, రూ .199 ప్లాన్ ఉన్నాయి. ఈ మూడు ప్లాన్స్ కొత్తవి కావు మరియు కొన్ని సర్కిళ్లలో కొంతకాలంగా అందుబాటులో ఉన్నాయి.
ముందుగా, ఎయిర్టెల్ యొక్క రూ .99 ప్లాన్ ఇప్పుడు బీహార్ & జార్ఖండ్, మరియు ఒడిశాలో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ఇంతకుముందు కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, యుపి ఈస్ట్, మరియు MP 3& ఛత్తీస్‌ఘడ్ లో అందుబాటులో ఉంది.
ఇక రూ .129 మరియు రూ. 199 ప్లాన్ విషయానికి వస్తే, ఇప్పుడు డిల్లీ ఎన్‌సిఆర్, అస్సాం, బీహార్ & జార్ఖండ్, ముంబై, నార్త్ ఈస్ట్ మరియు ఒడిశాలో అందుబాటులో ఉంది. అయితే ముందునుండే, గుజరాత్, హర్యానా, కేరళ, కోల్‌కతా, మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర మరియు గోవా, రాజస్థాన్, 6యుపి ఈస్ట్, యుపి వెస్ట్ మరియు ఉత్తరాఖండ్, మరియు పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వినియోగదారులు ఎయిర్టెల్ యాప్ లేదా వెబ్‌సైట్ ఉపయోగించి పై ప్లాన్‌ల కోసం రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మాత్రం ఈ ప్లాన్స్ ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ ప్లాన్స్ ఎక్కువగా ఆదరాబున పొందుతున్నాయి కాబట్టి తెలుగు రాష్ష్ట్రాల్లో కూడా ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
ఎయిర్టెల్ రూ .99 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 24 రోజుల చెల్లుబాటుతో, మొత్తం 1 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్ / నేషనల్ కాల్స్ ను తెస్తుంది. వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్ మరియు జీ 5 ప్రీమియమ్‌లకు కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు.
ఎయిర్టెల్ రూ .129 ప్రీపెయిడ్ రీఛార్జ్ దానితో 24 రోజుల ప్రామాణికత, మొత్తం 1 జిబి డేటా, రోజుకు 300 ఎస్ఎంఎస్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్ / నేషనల్ కాల్‌లను తెస్తుంది. వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్ మరియు జీ 5 ప్రీమియమ్‌లకు కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు.
ఎయిర్టెల్ రూ 199 ప్రీపెయిడ్ రీఛార్జ్ దానితో 24 రోజుల ప్రామాణికత, రోజుకు 1 జిబి డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్ / నేషనల్ కాల్‌లను తెస్తుంది. వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, వింక్ మ్యూజిక్ మరియు జీ 5 ప్రీమియమ్‌లకు కూడా ఉచిత యాక్సెస్ ను పొందుతారు.
మరిన్ని ఎయిర్టెల్ ప్లాన్స్ మరియు రీఛార్జ్ కోసం AIRTEL పైన నొక్కండి .