భారతదేశపు టెలికం ఖ్యాతి ఇప్పుడు మరొక మెట్టు పైకెక్కింది. భారతదేశంలో 5G ఎప్పుడొస్తుందని ఎదురుచేసేవారిని ఆశ్చర్యపరించింది ఎయిర్టెల్. ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ (Airtel) హైదరాబాద్ నగరంలో వాణిజ్య నెట్వర్క్ లో Live 5G సేవను విజయవంతంగా నిర్వహించింది. దీనితో, దేశంలో 5G ని విజయవంతంగా డెమోన్ స్ట్రేట్ చేసిన మొట్టమొదటి టెలికం సంస్థగా Airtel నిలిచింది.
Airtel తన ప్రస్తుత సరళీకృత స్పెక్ట్రంను మిడ్ బ్యాండ్ 1800 MHz లో NSA (నాన్ స్టాండ్ అలోన్) నెట్వర్క్ టెక్నాలజీ ద్వారా చేసింది. డైనమిక్ స్పెక్ట్రం షేరింగ్ ఉపయోగించి, ఎయిర్టెల్ తన 5G మరియు 4G లను ఒకే స్పెక్ట్రం బ్లాక్ లో ఏకకాలంలో నిర్వహించింది. ఈ పనితీరు రేడియో, కోర్ మరియు ట్రాన్స్ పోర్ట్ వంటి అన్ని డొమైన్లలో ఎయిర్టెల్ నెట్వర్క్ యొక్క 5 జి సంసిద్ధతను ధృవీకరించింది.
ఇక ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే, ఎయిర్టెల్ 5 జి 10 రేట్లు వేగవంతమైనదిగా వుంటుంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో డెమోన్ స్ట్రేట్ చేసిన ఎయిర్టెల్ 5G తో యూజర్లు తమ 5 జీ ఫోన్లో పూర్తి నిడివి గల సినిమాని సెకన్లలో డౌన్లోడ్ చేసుకోగలిగారు. ఈ పనితీరు తమ సంస్థ యొక్క సాంకేతిక సామర్థ్యాలను నొక్కి చెప్పిందని ఎయిర్టెల్ పేర్కొంది. అలాగే, 5 జి అనుభవం యొక్క పూర్తి ప్రభావం, తగినంత స్పెక్ట్రం అందుబాటులో ఉన్నప్పుడు మరియు ప్రభుత్వ అనుమతి పొందినప్పుడు తన వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కూడా తెలిపింది.