Airtel Budget Plan: అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ సంవత్సరం మొత్తం అందించే బెస్ట్ ప్లాన్.!

ఎయిర్టెల్ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఎప్పటికప్పుడు జత చేస్తూనే ఉంది
Airtel Budget Plan తక్కువ ధరలో అన్లిమిటెడ్ కాలింగ్ అందించే బెస్ట్ ప్లాన్
ఈ ప్లాన్స్ ప్రవేశపెట్టడంలో TRAI ముఖ్య పాత్ర వహించింది
Airtel Budget Plan: ఎయిర్టెల్ యూజర్ల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఎప్పటికప్పుడు తన పోర్ట్ ఫోలియో కి జత చేస్తూనే ఉంది. అయితే, యూజర్ సౌలభ్యం కోసం రీసెంట్ గా అందించిన బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చాలా తక్కువ ధరలో అన్లిమిటెడ్ కాలింగ్ అందించేవిగా ఉన్నాయి. అయితే, ఈ ప్లాన్స్ ప్రవేశపెట్టడంలో TRAI ముఖ్య పాత్ర వహించింది.
ఏమిటా Airtel Budget Plan?
ఎయిర్టెల్ యొక్క కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 1,849 ప్లాన్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటుంది. ప్రతి టెలికాం కంపెనీ కూడా వాయిస్ మరియు SMS కలిగిన వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుని రావాలి అని విడుదల చేసిన TRAI ఆదేశాల మేరకు ఎయిర్టెల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను అందించింది.
ఈ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది మరియు మరిన్ని లాభాలు కూడా అందిస్తుంది. ఎయిర్టెల్ అందించిన ఈ బడ్జెట్ అన్లిమిటెడ్ కాలింగ్ వాయిస్ ప్లాన్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
Also Read: Vivo V50: టాప్ 5 ఫీచర్స్ మరియు కలర్ వేరియంట్స్ తెలుసుకోండి.!
ఎయిర్టెల్ రూ. 1,849 ప్లాన్ బెనిఫిట్స్
ఇక ఈ ఎయిర్టెల్ రూ. 1,849 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. ఇది కాకుండా సంవత్సరం మొత్తానికి 3600 SMS లను కూడా అందిస్తుంది. ఇది వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో ఎటువంటి డేటా బెనిఫిట్స్ లభించవు.
ఇక ఈ ఎయిర్టెల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే మరిన్ని ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో మూడు నెలల Apollo 24|7 మెంబర్ షిప్ మరియు ఉచిత హలో ట్యూన్స్ కూడా ఆఫర్ చేస్తుంది.
మరిన్ని బెస్ట్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here