Airtel ధమాకా అఫర్: అన్లిమిటెడ్ డేటా మరియు OTT సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!

Airtel ధమాకా అఫర్: అన్లిమిటెడ్ డేటా మరియు OTT సబ్ స్క్రిప్షన్ అందుకోండి.!
HIGHLIGHTS

ఎయిర్టెల్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్ అందించింది

అన్లిమిటెడ్ డేటా మరియు సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే ధమాకా అఫర్

అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు

ఎయిర్టెల్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్ అందించింది. అన్లిమిటెడ్ డేటా మరియు సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందించే ధమాకా అఫర్ ను ఎయిర్టెల్ తీసుకువచ్చింది. కొత్తగా అందించిన ఈ రీఛార్జ్ అఫర్లను రీఛార్జ్ చేసే కస్టమర్లు అన్లిమిటెడ్ 5G డేటాతో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్ని ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందవచ్చు. ఎయిర్టెల్ అఫర్ చేస్తున్న ఈ ప్లాన్స్ వివరాలు చూద్దామా. 

ఆన్లైన్ అవసరాలను మరియు OTT కంటెంట్ వినియోగ అవసరాలను బేస్ చేసుకొని ఈ ప్లాన్స్ ను జత చేసినట్లు ఈ ప్లాన్స్ ను చూస్తే అర్దమవుతుంది. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళితే, ఎయిర్టెల్ యొక్క రూ. 3,359, రూ. 999, రూ. 839, రూ. 699 మరియు రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ నాలుగు ప్లాన్స్ తో అన్లిమిటెడ్ 5G డేటా మరియు OTT వినియోగ లాభాలను మీరు పొందవచ్చు. 

ఈ నాలుగు ప్లాన్స్ లో 499 రూపాయల ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే బడ్జెట్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ తో 5G యూజర్లకు అన్లిమిటెడ్ డేటా అఫర్ వర్తిస్తుంది. 4G యూజర్లకు డైలీ 3GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS లిమిట్ తో పాటుగా రూ. 149 రూపాయల విలువైన Disney+ HotStar 3 నెలల సబ్ స్క్రిప్షన్, 28 రోజుల Xtream APP యాక్సెస్, హలొట్యూన్స్, Wynk Music లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ఫాస్ట్ ట్యాగ్ పైన రూ. 100 క్యాష్ బ్యాక్ Apollo 24/7 సర్కిల్ 3 నెలల యాక్సెస్ ఫ్రీ గా లభిస్తుంది.

ఇక ఎయిర్టెల్ యొక్క రెండవ ప్లాన్ రూ. 699 పైన తెలిపిన రూ. 499 ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను 56 రోజుల వ్యాలిడిటీ కాలనికి అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ లో Disney+ Hotstar స్థానంలో Amazon Prime Video యొక్క 56 రోజుల సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అఫర్ చేస్తోంది.

ఇక రూ. 839 మరియు రూ. 999 ప్లాన్స్ విషయానికి వస్తే, ఈ రెండు ప్లాన్స్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. అయితే, ఈ రూ. 839 ప్లాన్ డైలీ 2GB డేటా అందిస్తే, రూ. 999 ప్లాన్ డైలీ 2.5 GB డేటా అందిస్తుంది 5G యూజర్లు ఈ రెండు ప్లాన్స్ పైన అన్లిమిటెడ్ 5G డేటా పొందవచ్చు. అలాగే, రూ.839 ప్లాన్ తో Disney+ Hotstar యొక్క 3 నెలల సబ్ స్క్రిప్షన్ లభిస్తే, రూ. 999 ప్లాన్ తో 84 రోజుల Amazon Prime Video  యాక్సెస్ లభిస్తుంది. ఇక అన్లిమిటెడ్ కాలింగ్ మరియు ఇతర ప్రయోజనాలు పైన అందించిన ప్లాన్స్ మాదిరిగానే లభిస్తాయి. 

ఇక చివరి ప్లాన్ రూ. 3,359 విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో డైలీ 2.5GB 4G డేటా (5G యూజర్లకు అన్లిమిటెడ్ 5G డేటా) అన్లిమిటెడ్ కాలింగ్, రిడైలీ 100 SMS ప్రయోజనాలను పూర్తిగా ఒక సంవత్సరం వ్యాలిడిటీ కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్ తో మీరు రూ. 499 విలువైన Disney+ HotStar సబ్ స్క్రిప్షన్, Xtream APP యాక్సెస్, హలొట్యూన్స్, Wynk Music లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ఫాస్ట్ ట్యాగ్ పైన రూ. 100 క్యాష్ బ్యాక్ Apollo 24/7 సర్కిల్ 3 నెలల యాక్సెస్ ని ఈ ప్లాన్ తో ఫ్రీ గా అఫర్ చేస్తోంది.
                                        
మరిన్ని ఎయిర్టెల్ బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo