airtel best prepaid plans with jio hotstar access to watch IPL 2025 Live
IPL 2025 Live ఉచితంగా చూడాలనుకుంటే, ఎయిర్టెల్ యూజర్లు ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. అదెలా అనుకుంటున్నారా? ఎయిర్టెల్ యొక్క కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ Jio Hotstar సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. ఐపీఎల్ లైవ్ స్ట్రీమ్ జియో హాట్ స్టార్ ద్వారా ప్రసారం అవుతుంది. కాబట్టి, ఈ ఎయిర్టెల్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఎంజాయ్ చేయవచ్చు.
ఎయిర్టెల్ యొక్క నాలుగు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ జియో హాట్ స్టార్ షబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తాయి. ఈ నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఈ ఎయిర్టెల్ ప్లాన్ కేవలం డేటా మాత్రమే అందించే డేటా ప్లాన్ మరియు ఈ ప్లాన్ 7 రోజులు వ్యాలిడిటీ కలిగి 5GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 3 నెలల జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.
ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ డైలీ 3GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS లను అందిస్తుంది. అలాగే, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటాని కూడా అందిస్తుంది. ఇది కాకుండా 3 నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్, 28 రోజుల Zee5 యాక్సెస్ మరియు ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ యాక్సెస్ కూడా అందిస్తుంది. అంతేకాదు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు 3 నెలల Apollo 24|7 మెంబర్ షిప్ కూడా ఉచితంగా అందిస్తుంది.
ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2GB డేటా మరియు డైలీ 100SMS లు అందిస్తుంది. ఇది కాకుండా 3 నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ మరియు 84 రోజుల ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ యాక్సెస్ కూడా తీసుకొస్తుంది. ఇదేకాదు, ఫ్రీ హలో ట్యూన్స్ మరియు 3 నెలల Apollo 24|7 మెంబర్ షిప్ కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: భారీ డిస్కౌంట్ తో 33 వేలకే Mini LED Smart Tv అందుకోండి.!
యోక్క బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా చెప్పబడుతుంది. ఈ ప్లాన్ 365 రోజుల అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా, డైలీ 2.5GB డేటా మరియు డైలీ 100SMS లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ తో ఫ్రీ హలో ట్యూన్స్, 3 నెలల Apollo 24|7 మెంబర్ షిప్, వన్ ఇయర్ జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ మరియు వన్ ఇయర్ ఎయిర్టెల్ ఎక్స్ ట్రీమ్ సబ్ స్క్రిప్షన్ ను కూడా తీసుకు వస్తుంది.