Airtel Best Plan: యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను తీసుకురావడంలో ఎయిర్టెల్ ముందుంటుంది. ఇటీవల పెరిగిన టారిఫ్ రేట్లు యూజర్ కు భారంగా మారిన విషయం తెలిసిందే. అందుకే, తక్కువ ఖర్చుతో యూజర్ కు ఎక్కువ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లను కొత్తగా విడుదల చేసింది. వాటిలో ఒక బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నారు.
ఎయిర్టెల్ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 929 బెస్ట్ బడ్జెట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు మరియు మరిన్ని ఇతర బెనిఫిట్స్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
ఎయిర్టెల్ రూ. 929 ప్రీపెయిడ్ ప్లాన్ 90 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 90 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ లాభాల్ని ఆనందించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో ప్రతి రోజు 1.5GB డేటా మరియు 100 SMS వినియోగ ప్రయోజనాన్ని కూడా ఆనందించవచ్చు. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 64Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.
ఇక ఈ ప్లాన్ అందించే ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో ఎయిర్టెల్ Xstream App కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది. తద్వారా ఉచితంగా లైవ్ ఛానల్స్, సినిమాలు మరియు టీవీ షో లను ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, Apollo 24|7 Circle మరియు Free Hello Tunes సౌలభ్యాన్ని కూడా అందిస్తుంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ సూపర్ డీల్: 23 వేలకే 55 ఇంచ్ 4K Smart Tv అందుకోండి.!
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ 5G డేటా లభించదు. అయితే, ఈ ప్లాన్ చవక ధరలో లాంగ్ వ్యాలిడిటీతో వచ్చే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది.
మరిన్ని బెస్ట్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here