దేశంలోని అతి పెద్ద టెలికం కంపెనీ అయినటువంటి ఎయిర్టెల్, ఒక మూడు కొత్త ప్లాన్లను విడుదలచేసింది, ఈ ప్లాన్లు ప్రధానంగా అంతర్జాతీయ రోమింగ్ కోసం ప్రారంభించబడ్డాయి. ఈ ప్రణాళికల సహాయంతో, మీరు అంతర్జాతీయ కాల్స్ కోసం తక్కువ ఖర్చుతో మంచి ప్రయోజనాలను పొందుతారు. Telicomtok ప్రకారం, ఎయిర్టెల్ ఈ ప్రీపెయిడ్ ప్రాణాలికలతో వినియోగదారులకు అంతర్జాతీయ కాలింగ్ కోసం తక్కువ ధరతో ఎక్కువ లాభాలను అందించనుంది. ఈ ప్రణాళికల ప్రారంభ ధర రు .196 రూపాయలు నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రాథమిక ప్రణాళికలో మీరు 20 నిమిషాల అంతర్జాతీయ కాలింగును పొందుతారు, ఇది ప్రీపెయిడ్ ప్లానుతో ఏ ఇతర దేశానికైనా 20 నిముషాల పాటు మీరు కాల్ చేయగల ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఇంతే కాకుండా, మీరు మరొక ప్లాన్ కూడా ఉపయోగించవచ్చు, ఈ ప్లాన్ 296 రూపాయల ధరలో వస్తుంది. మీరు ఈ ప్రణాళికలో అంతర్జాతీయ కాలింగ్ కోసం 40 నిమిషాల కాలింగ్ పొందుతారు. ఈ కేటగిరిలోమరొక ప్లాన్ కూడా ఉంటుంది, అది రూ 446 ధరతో కొంచం ఖరీదైన ప్రణాళికగా ఉంటుంది, ఇది మీకు అంతర్జాతీయ కాలింగ్ సౌకర్యాని సుమారుగా 75 నిమిషాల వరకు అందిస్తుంది. ఈ అన్ని పధకాలలో మీరు వివిధ వ్యాలిడిటీని పొందుతారు, ఇది ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ కాలింగ్ కోసం మీకు సహాయపడుతుంది.
మీరు ఎయిర్టెల్ యొక్క రూ 196 ఈ ప్రణాళికతో, 1 రోజు వ్యాలిడిటీని పొందుతారు. అలాగే, ఈ రూ 296 మరియు రూ 446 ఈ ప్రణాళికలతోవరుసగా 30 మరియు 90 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ ప్రణాళికలు ద్వారా, మీరు 20 దేశాలలో వున్నవారికి అంతర్జాతీయ కాలింగ్ చేయగల సౌకర్యాన్ని పొందగలరు. అవి ఏమేమి దేశాలంటే, అమెరికా, బ్రిటన్, కెనడా, చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, హాంగ్ కాంగ్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, నెదర్లాండ్స్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, సౌదీ అరేబియా, యుఎఇ, ఖతార్, కువైట్ మరియు బహ్రాన్ వంటివి ఉన్నాయి.
గమనిక: డిజిట్ తెలుగు ఇప్పుడు టెలిగ్రామ్ లో కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజు టెక్ గురించి తాజా వార్తల్ని మీరు టెలిగ్రామ్ ఆప్ ద్వారా అందుకోవాలనుకుంటే డిజిట్ తెలుగు టెలిగ్రామ్ ని సబ్ స్క్రైబ్ చేయండి !