ప్రస్తుతం నడుస్తున్న టెలికం కంపెనీల పోటీకి అనుగుణంగా భారతీ ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ లు సరికొత్త ప్లాన్స్ తీసుకురావడమే కాకుండా, ప్రస్తుతం వాడుకలోవున్న ప్రీపెయిడ్ ప్లాన్లలో కూడా కొంత మార్పులు చేస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులోవున్న, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ యొక్క రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ పైన రోజుకు 100MB అధిక డేటాని ప్రకటించాయి.
వోడాఫోన్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ముందుగా, ఈ వోడాఫోన్ యొక్క రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజువారీ 1.4 GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుండగా, ఇప్పుడు ప్రకటించిన 100 MB అధిక డేటాతో కలిపి రోజువారీ 1.5 GB డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. అలాగే, అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ మరియు డైలీ 100SMS లతో కలిపి 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
భారతీ ఎయిర్టెల్ రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ముందుగా, భారతీ ఎయిర్టెల్ యొక్క రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజువారీ 1.4 GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుండగా, ఇప్పుడు ప్రకటించిన 100 MB అధిక డేటాతో కలిపి రోజువారీ 1.5 GB డేటా ప్రయోజనాన్ని అందుకుంటారు. అలాగే, అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ మరియు డైలీ 100SMS లతో కలిపి 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
అంటే, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ యొక్క ఈ రూ. 199 ప్రీపెయిడ్ ప్లానుతో రోజువారీ 1.5 GB డాటాతో 28 రోజుల చెల్లుబాటుకు గాను మొత్తంగా 42GB డేటాని పొందుతారు వినియోగదారులు.
అయితే, రిలయన్స్ జియో కూడా ఇటువంటి ప్రయోజనాలనే రూ. 149 ప్రీపెయిడ్ ప్లానుతో అందిస్తోంది. ఈ 149 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 1.5 GB డేటా, అపరిమిత లోకల్ మరియు STD కాలింగ్ మరియు డైలీ 100SMS లతో కలిపి 28 వ్యాలిడిటీ పొందవచ్చు. అంటే 28 రోజుల చెల్లుబాటుకు గాను మొత్తంగా 42GB డేటాని పొందుతారు వినియోగదారులు