ప్రంపంచ వ్యాప్యంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుండి ప్రజలను రక్షించేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ముందుగా, ఈ నెల 14 వ తేదీ వరకూ మాత్రమే ప్రకటించిన లాక్ డౌన్, పరిస్థితుల కారణంగా మరిన్ని రోజులు కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది.అందుకోసమే, ప్రధాని మోడీ మే 3 వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించి మరొక సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా, అనేక సంస్థలు తమవంతు సహాయ సహకారాలను అందిస్తుండగా, ప్రధాన టెలికామ్ సంస్థలు అయినటువంటి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు తమ వంతు సహాయంగా ఈ గుడ్ న్యూస్ ప్రకటించాయి.
ముందుగా LiveMint అందించిన నివేదిక ప్రకారం, ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల యొక్క వ్యాలిడిటీని మరొకసారి పెంచినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో, ఏప్రిల్ 20 వ తేదీ వరకూ ఎటువంటి మినిమమ్ రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా వ్యాలిడిటీని పెంచాయి . అయితే, ప్రస్తుతం మరొకసారి లాక్ డౌన్ పొడిగింపు కారణంగా మరొకసారి ఈ టెలికం సంస్థలు కూడా వారి వినియోగదారుల వ్యాలిడిటీని మే 3 వరకూ పెంచినట్లు ఈ నివేదిక పేర్కొంది.
అంటే, మే 3 తేదీ లోపు ప్రీపెయిడ్ వ్యాలిడిటీ ముగిసినా కూడా ఇన్ కమింగ్ కాల్స్ మాత్రం కొనసాగుతాయి. అయితే, ఈ అవకాశాన్ని ఆధాయం తక్కువగా వున్నా వినియోగదారుల కోసం మాత్రమే అందించనున్నట్లు తెలిపాయి. దీని ప్రకారం, ఫీచర్ ఫోన్లను ఉపయోగించే వినియోగరుల నంబర్లకు ఈ సౌలభయాన్ని చేకూర్చనున్నట్లు తెలిపాయి. దీని ద్వారా, ఆధాయం తక్కువగా ఉన్న చాలా మంది వినియోగదారులకు, ఇన్ కమింగ్ కాల్స్ కోసం చెయ్యాల్సిన మినిమమ్ రీఛార్జ్ నుండి ఊరట లభిస్తుందని ఈ నివేదిక పేర్కొంది.