అతిపెద్ద టెలికం నెట్వర్క్ సంస్థ Airtel ఎట్టకేలకు తన 5G సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. Airtel 5G Plus పేరుతో తీసుకొచ్చిన 5G నెట్వర్క్ ప్రస్తుతం దేశంలోని 8 మహా నగరాల్లో లాంచ్ చేయబడింది. అంతేకాదు, భారతదేశంలో 5G సేవలను అధికారికంగా ప్రారంభించిన మొదటి టెలికాం సంస్థగా ఎయిర్టెల్ నిలుస్తుంది. ఎయిర్టెల్ తన 5G సర్వీసులను అఫర్ చేస్తున్న 8 మహా నగరాలలో హైదరాబాద్ కూడా వుంది. ఇంకెందుకు ఆలశ్యం Airtel 5G Plus గురించి తెలుసుకుందాం పదండి.
ఎయిర్టెల్ అం కాకుండా Airtel 5G Plus అని ఎందుకు పిలుస్తున్నారు? అని మీకు డౌట్ వచ్చిందా. అసలు విషయం ఏమిటంటే, భారతీ ఎయిర్టెల్ తీసుకొచ్చిన 5G సర్వీసులను Airtel 5G Plus పేరుతో లాంచ్ చేసింది మరియు ప్రస్తుతానికి Airtel 5G సేవలు 8 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులు మాత్రమే ప్రస్తుతానికి ఈ సేవను ఉపయోగించగలరు. అయితే, త్వరలోనే మరిన్ని నగరాల్లో ఈ 5G సేవలను విస్తరిస్తుందని ఇటీవల జరిగిన IMC 2022 నుండి ఎయిర్టెల్ తెలిపింది. అంటే, ఎయిర్టెల్ 5జి ప్లస్ సేవలు వేగంగా విస్తరిస్తుంది కావచ్చు.
వాస్తవానికి, 5G గురించి ఎక్కువగా ప్రజలు అడిగే ప్రధాన ప్రశ్న'Airtel 5G Plus కోసం కొత్త SIM కార్డ్ తీసుకోవాలా'. ఎయిర్టెల్ యొక్క Airtel 5G Plus కోసం కొత్త SIM కార్డ్ తీసుకోవలసిన అవసరం లేదు. అంతేకాదు, మీరు ఉపయోగిస్తున్న 4G SIM స్వతహాగానే 5G Enable తో వస్తుంది. అంటే, ప్రస్తుతం మీరు వాడుతున్న 4G SIM కార్డ్ టోన్ 5G సర్వీస్ లను పొందవచ్చు.
ప్రస్తుతానికి, ఎయిర్టెల్ ఎలాంటి 5G ప్లాన్‌లను కూడా ప్రకటించలేదు. అయితే, 5G సర్వీస్ లు ప్రారంభించబడి, కొత్త 5G ప్లాన్స్ వచ్చే వరకూ వినియోగదారులు తమ ప్రస్తుత డేటా ప్లాన్స్ పైనే 5G సేవలను ఉపయోగించుకోవచ్చు.