Airtel 5G Plus: ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా 3,000 సిటిలలో తన 5G నెట్ వర్క్ ను అఫర్ చేస్తోంది. దేశం నలుమూలల ఉన్న అన్ని ప్రధాన నగరాలలో ఎయిర్టెల్ 5G నెట్ వర్క్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాదు, ఎయిర్టెల్ 5జి ప్లస్ తో అన్లిమిటెడ్ 5G ని కూడా అఫర్ చేస్తోంది. ఎయిర్టెల్ 4G కి 30 రేట్ల వేగాన్ని ఈ ఎయిర్టెల్ 5G ప్లస్ తో యూజరాలు అందుకోవచ్చని కూడా ఎయిర్టెల్ తెలిపింది.
దేశంలో 5G నెట్ వర్క్ విస్తరణను శరవేగంగా నిర్వహిస్తున్న ఎయిర్టెల్ ఇప్పటికే 3,000 నగరాలలో 5G నెట్ వర్క్ ను విస్తరించింది. రోజు 30 నుండి 40 సిటీలలో 5G విస్తరణను కొనసాగిస్తూ అన్న మాట ప్రకారం సెప్టెంబర్ 2023 నాటికి అన్ని ప్రధాన సిటీలు మరియు ఉప నగరాల్లో 5G నెట్ వర్క్ ను విస్తరిస్తామని, తద్వారా అర్బన్ మరియు రూరల్ ఏరియాలలో యూజర్లకు 5G నెట్ వర్క్ ను చేర్చగలుగుతాము, అని ఎయిర్టెల్ టెక్నాలజీ ఆఫీసర్, రణదీప్ సేఖోన్ తెలిపారు.
Airtel 5G Plus ఎయిర్టెల్ కూడా అన్లిమిటెడ్ 5G డేటాని అఫర్ చేస్తోంది. ఈ అన్లిమిటెడ్ 5G ని పొందాలంటే యూజర్లు రూ. 239 మరియు అంటే కంటే పైన లభించే ప్లాన్స్ తో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఎయిర్టెల్ కొన్ని కొత్త ప్లాన్ లను ఉచిత OTT సబ్ స్క్రిప్షన్ ప్రయోజనంతో అందించింది. మొత్తంగా, ఎయిర్టెల్ 5G నెట్ వర్క్ ని త్వరగా విస్తరించడమే కాకుండా దానికి తగిన విలువైన ప్లాన్స్ ను కూడా జతచేసి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.