ఆంధ్రప్రదేశ్ తో సహా 10 సర్కిళ్లలో ఎయిర్టెల్ 4G స్పీడ్ పెరగనుంది

Updated on 23-Jan-2019
HIGHLIGHTS

ఎయిర్టెల్ 4G స్పీడును పెంచడానికి ఉప-గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ ను ఉపయోగించనుంది.

ప్రస్తుతం టెలికం రంగంలో కొనసాగుతున్న పోటీకి అనుగుణంగా తన వినియోగదారులకి ఉన్నతమైన 4G అందించడం కోసం ఎయిర్టెల్ కొత్త సమీకరణలను చేస్తోంది. తద్వారా, త్వరలోనే ఎయిర్టెల్ యొక్క 10 సర్కిళ్లలోని వినియోగదారులు ఉన్నతమైన 4G సర్వీసును అందుకోనున్నారు. ఎలాగంటే , ఆంధ్రప్రదేశ్ తో సహా 10 సర్కిళ్లలో ఉన్నతమైన 900 Mhz బ్యాండ్ 4G స్పెక్ట్రమ్ ను ఉపగిస్తుంది.

ఈ టెలికం సంస్థ, ఈ సర్వీసును  ముంబాయి, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కోల్ కతా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్ , అస్సాం, రాజస్థాన్ వంటి సర్కిళ్లలో పూర్తిగా విస్తరించడం కోసం ఎరిక్సన్, హువావే, నోకియా మరియు ZTE తో కలసి పనిచేస్తోంది .  ఈ 900 Mhz స్పెక్ట్రమ్ కి విస్తరించబడిన తరువాత, ఎయిర్టెల్ యొక్క వినియోగదారులు ఆఫీసులు, ఇల్లు లేదా షాపింగ్ మాల్స్ వంటి ఇండోర్ పరిసరాలలో కూడా మంచి 4G ని అందుకుంటారు.

 ప్రధానంగా ఈ 900 LTE సాంకేతికతను ఇండోర్ నెట్వర్కు ను మెరుగు పరచడం కోసం తీసుకురానున్నాము మరియు దీని ద్వారా ఎటువంటి అంతరాయంలేని   4G  అందుబాటుని ఇవ్వనున్నామని, భారతి ఎయిర్టెల్ యొక్క CTO అయినటువంటి, రణదీప్ సెఖోన్ తెలిపారు.            

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :