5G మోజును సొమ్ము చేసుకుంటున్న స్కామర్లు.!

5G మోజును సొమ్ము చేసుకుంటున్న స్కామర్లు.!
HIGHLIGHTS

5G నెట్ వర్క్ అంటే ప్రజల్లో మోజు పెరిగిపోయింది

5G నెట్ వర్క్ అంటే ప్రజల్లో మోజు పెరిగిపోయింది

ఇదే అదునుగా స్కామర్లు 5G క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు

అత్యంత వేగవతమైన ఇంటర్నెట్ సర్వీస్ లను అఫర్ చేసే 5G నెట్ వర్క్ అంటే ప్రజల్లో మోజు పెరిగిపోయింది. ముఖ్యంగా యువత 5G నెట్ వరకు కోసం ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ టెలికం కంపెనీలు పోటాపోటీగా = దేశంలోని ముఖ్యమైన నగరాల్లో తమ 5G సర్వీస్ లను శరవేగంగా విస్తరిస్తున్నాయి. కానీ, ఇప్పటికి కొన్ని ప్రధాన నగరాలు మరియు ప్రాంతాలలో మాత్రమే ఈ 5G నెట్ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చింది. అయితే, 4G కంటే చాలా వేగంతో ఇంటర్నెట్ స్పీడ్ అందుకునే అవకాశం ఉండటంతో, ప్రజల్లో 5G పైన బాగా క్రేజ్ పెరిగింది. అయితే, ఇదే అదునుగా స్కామర్లు 5G క్రేజ్ ని క్యాష్ చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామా.

వాస్తవానికి, టెలికం కంపెనీలు 5G నెట్ వర్క్ ను దశల వారీగా ఒక్కొక్క నగరంలో లాంచ్ చేస్తున్నాయి మరియు త్వరలోనే దేశవ్యాప్తంగా తమ సర్వీస్ లను అంధుబాటులోకి తీసుకువచ్చే దిశగా సాగుతున్నాయి. కానీ, ప్రజల్లో అతిగా ఉన్న 5G క్రేజ్ ని క్యాష్ చేసుకునే పనిలో స్కామర్లు కొత్త మోసాలకు తెరలేపుతుతున్నారు. స్కామర్లు, 5G సర్వీస్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న వారిని టార్గెట్ చేసే ఈ మోసాలకు పాల్పడుతున్నారు. 

మీరు 5G నెట్ అవిర్క్ కు అప్ గ్రేడ్ అవ్వాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి, అని టెలికం కంపెనీల మాదిరిగా నమ్మబలుకుతూ లింక్స్ తో కూడిన SMS లను పంపిస్తున్నారు. ఈ లింక్ పైన క్లిక్ చేసే అమాయక ప్రజల పర్సనల్ డేటాతో పాటుగా బ్యాంక్ అకౌంట్ విరాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇంకేముంది, మీ వివరాలు అందుకున్న స్కామర్లు మీ అకౌంట్ మొత్తం ఖాళి చేసేస్తారు. 

వాస్తవానికి, మీరు 5G నెట్ వర్క్ కు మారాలంటే ఎటువాంటి లింక్ లేదా కొత్త SIM కార్డ్ ను ఆశ్రయించాల్సిన పనిలేదు. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న 4G SIM కార్డ్ పైన మీరు 5G నెట్ వర్క్ ను పొందవచ్చు. అంతేకాదు, 5G నెట్ వర్క్ లాంచ్ చేస్తున్న మరియు చేయనున్న ప్రాంతలలో వివరాలను కూడా టెలికం కంపెనీలు ప్రకటిసున్నాయి. అందుకే, ఇటువంటి మోసపూరితమైన మెసేజీలను నమ్మకండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo