2025 BSNL Super offer: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు.!

2025 BSNL Super offer: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు.!
HIGHLIGHTS

2025 BSNL Super offer 60 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తుంది

త్త సంవత్సరంలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మరిన్ని లాభాలు

ప్రత్యేకమైన ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది

2025 BSNL Super offer: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు కొత్త సంవత్సరంలో సూపర్ ఆఫర్ ను అందించింది. ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 60 రోజుల అదనపు వ్యాలిడిటీ అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ ఆఫర్ మరియు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు గురించి తెలుసుకుందామా.

2025 BSNL Super offer ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ యొక్క బేస్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా పేరొందిన రూ. 2,399 పై ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది. ముందుగా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుండగా ఇప్పుడు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పై 60 రోజుల అదనపు వ్యాలిడిటీ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 2025 సంవత్సరంలో

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు + 60 రోజుల అదనపు వ్యాలిటీడీతో టోటల్ 425 రోజులు చెల్లుబాటు అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్లిమిటెడ్ బెనిఫిట్స్ 365 రోజులు మాత్రమే అందిస్తుంది, మిగిలిన 60 రోజులు కేవలం వ్యాలిడిటీ మాత్రమే ఆఫర్ చేస్తుంది.

2025 BSNL Super offer

ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS లను అందిస్తుంది. ప్లాన్ తో వచ్చే రోజు వారి 2GB హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా వినియోగ ప్రయోజనం కూడా ఆఫర్ చేస్తుంది.

అయితే, ఈ ప్లాన్ 60 రోజులు అదనపు చెల్లుబాటును ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే ఫ్రీ బైస్ ముగిసిన తర్వాత లోకల్ కాల్స్ కోసం Rs 1/min, STD కాల్స్ కోసం రూ 1.3/min, లోకల్ SMS కోసం 80 పైసలు, నేషనల్ SMS కోసం రూ. 1.20 మరియు 1 MB డేటా కోసం 25p ఛార్జ్ చేస్తుంది.

Also Read: Realme 14 Pro Series : కీలకమైన ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ అనౌన్స్.!

మరిన్ని బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo