NASA Alert: భారీ గ్రహశకలం ఢీకొనడంతో భూమిపై ఉన్న రాక్షస బల్లుల జాతి అంతరించింది. అయితే, పెరిగిన టెక్నాలజీ మరియు పరిజ్ఞానంతో భూమి వైపుగా వచ్చే లేదా భూగోళానికి ప్రమాదకరమైన గ్రహశకలాల కదలికలను ఎప్పటి కప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయాలు సుదీర్ఘంగా పరిశీలిస్తున్న నాసా ఇప్పుడు కొత్త అలర్ట్ ను అందించింది. గంటకు 29 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ 2011 MW1 అనే భారీ గ్రహశకలం దూసుకు వస్తోందని తెలిపింది.
నాసా కొత్తగా అందించిన అప్డేట్ లో నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ 2011 MW1, చాలా వేగంగా భూమి వైపు దూసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ గ్రహశకలం గంటకు 29 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోంది. ఈ భారీ గ్రహశకలం 380 అడుగుల పరిమాణంలో ఉంటుందని కూడా నాసా లెక్కించి చెప్పింది.
ఈ వార్త వినగానే ప్రతి ఒక్కరి మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఈ భారీ గ్రహశకలం తో భూమికి ఏదైనా ముప్పు పొంచి ఉందా? అని. నాసా ఈ ప్రశ్నకు కూడా క్లియర్ గా సమాధానం చెప్పింది. 150 మీటర్ల పరిమాణం ఉండి భూమికి 4.6 మిలియన్ మైల్స్ సమీపంలోకి చేరుకునే గ్రహశకలాలను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (NEO) గా నాసా పరిగణిస్తుంది. అయితే, ఈ నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ 2011 MW1 జూలై నాటికి భూమికి 2.4 మిలియన్ మైళ్ల సమీపానికి చేరుకునే 380 గ్రహశకలం కాబట్టి దీనితో ప్రమాదం ఉండదని నాసా తెలిపింది.
NASA Alert for asteroid
ఈ 2011 MW1 గ్రహశకలం, నియర్ ఎర్త్ ఆస్టరాయిడ్ (NEA) కేటగిరికి వస్తుందని నాసా తెలిపింది. ఈ గ్రహశకలం తో భూమికి ఎటువంటి ప్రమాదం వాటిల్లే అవకాశం లేదని కూడా నాసా తెలిపింది. పొటెన్షియల్లీ హాజర్డస్ ఆస్టరాయిడ్స్ (PHAs) ల పరిధిలోకి ఈ గ్రహశకలం రాదు కాబట్టి దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదని నాసా తెలిపింది.
Also Read: Jio యూజర్లకు గుడ్ న్యూస్: బడ్జెట్ ధరలో 98 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ తెచ్చిన జియో.!
వాస్తవానికి, నాసా భూమికి సమీపంలోనే కాదు దూరంగా ఉండే అనేక గ్రహశకలాలను నిశితంగా పరిశీలిస్తూ ఉంటుంది. ఏదైనా గ్రహశకలం భూమికి సమీపానికి చేరుకునే అవకాశం ఉంటే, ముందే దాని గురించి హెచ్చరిక అందిస్తుంది.