భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. PSLV-C60 ప్రయోగం పూర్తి స్థాయిలో సఫలం కావడంతో ఈ రాకెట్ సహాయంతో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్ ని ప్రయోగించి అంతరిక్షంలో చారిత్రాత్మక ప్రయోగం చేయడానికి పూనుకుంది. ఈరోజు ఈ రాత్రి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ కూడా అయ్యింది. ఈ రోజు రాత్రి 10:00:15 గంటలకు PSLV-C60 SPADEX రాకెట్ లాంచ్ కోసం టైం సెట్ చేసింది మరియు ఈ రాకెట్ నింగికి ఎగరడానికి సిద్ధంగా వుంది.
రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్ లను అంతరిక్షంలోకి పంపించి వాటిని ఒకటిగా కలిపి ఒకటిగా చేయడమే ఈ కొత్త ప్రయోగం. ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలో కొత్త పరికరాలు జత చేయడానికి మరియు పాత వాటిని విడదీయడానికి వీలుపడుతుంది. ఈ ప్రయోగం అంతరిక్షంలో భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (BAS) నిర్మాణానికి, చంద్రమండలం పై చేరడానికి, చంద్రమండలం నుంచి శాంపిల్స్ ను చేరవేయడం వంటి చాలా ప్రయోగాలకు సహాయపడుతుంది, అని ఇస్రో చెబుతోంది.
ఈరోజు రాత్రి PSLV-C60 రాకెట్ ద్వారా 220 కేజీల బరువున్న రెండు చిన్న స్పేస్ క్రాఫ్ట్ లను ఏక కాలంలో స్వతంత్రంగా ప్రయోగిస్తారు. ఈ ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ లు నింగికి ఏకకాలంలో విడివిడిగా చేరుకుంటాయి. అంతరిక్షంలో చేరిన తర్వాత ఈ రెండు స్పేస్ క్రాఫ్ట్ లలోని శాటిలైట్ లను ఒకదానికి మరొకటి జత చేస్తుంది (Docking). సక్సెస్ ఫుల్ గా జత చేసిన తర్వాత ఈ రెండిటి మధ్య ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్ ఫర్ ను డెమోన్స్ట్రేట్ చేసి మరలా తిరిగి విడదీస్తుంది (అన్ డాకింగ్).
Also Read: బ్రాండ్ న్యూ 50 ఇంచ్ QLED Smart Tv భారీ డిస్కౌంట్ తో 26 వేలకే అందుకోండి.!
ఈ శాటిలైట్ ప్రయోగం యొక్క లైవ్ కోసం ISRO అన్ని సోషల్ మాధ్యమాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసింది. యావత్ ప్రపంచం ఈ వేడుకకు సాక్షులుగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంది. ఈ లైవ్ కార్యక్రమం క్రింద డైరెక్ట్ గా చూడవచ్చు. ఈ లైవ్ కార్యక్రమం రాత్రి 9:30 నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది.