ZUK అనేది లెనోవో అనుబంధ కంపెని. ఇది లాస్ట్ ఇయర్ నుండి చైనా లో మార్కెట్ లో ఉంది. ఈ ఇయర్ ZUK రెండవ ఫ్లాగ్ షిప్ మోడల్ రిలీజ్ అయ్యింది..పేరు ZUK Z2 pro.
దీనిలో ఉన్న ప్రధాన హై లైట్స్ … 6GB ర్యామ్ మరియు స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ ప్రొసెసర్ 820, ఆండ్రాయిడ్ 6.0 అండ్ డ్యూయల్ సిమ్
ఫోన్ ఆల్రెడీ చైనా లో 27,650 రూ లకు లాంచ్ అయ్యింది. ఇండియాలో దీని availability పై కంపెని ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెల్లడించలేదు.
స్పెక్స్ విషయానికి వస్తే… 5.2 in 1920 x 1080P సూపర్ అమోలేడ్ డిస్ప్లే with 2.5D curved గ్లాస్. స్నాప్ డ్రాగన్ 820 2.15GHz ప్రొసెసర్.
6GB LPDDR4 ర్యామ్, 128GB UFS 2.0 ఇంటర్నెల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ వేరియంట్ తో పాటు 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా సెల్ అవుతుంది.
ఫుల్ మెటల్ బాడీ అండ్ 3D ఫ్లోటింగ్ గ్లాస్ డిస్ప్లే కలిగి ఉంది ఫోన్ లో. కెమెరా సెగ్మెంట్ లో 13MP రేర్ కెమెరా అండ్ 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
4G ఇంటర్నెట్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 OS, ఫింగర్ ప్రింట్ స్కానర్, క్విక్ చార్జింగ్ 3.0, 3100 mah బ్యాటరీ అండ్ హార్ట్ రేట్ కొరకు UV సెన్సార్ ఉన్నాయి.
Source: Weibo