ZTE వరల్డ్ లోనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తో Samsung ని ఢీ కొట్టబోతుంది . Axon M స్మార్ట్ ఫోన్ 17 అక్టోబర్ న లాంచ్ అవుతుంది . Android Authority అనుసారం , ZTE యొక్క ఈ కొత్త డివైస్ ని కాడ్ నేమ్ Axon Multy అని పిలుస్తారు , మరియు ఈ ఫోన్ లో రెండు రెండు స్క్రీన్ ఫీచర్ గలదు . దీనిని ఓపెన్ చేసి పెద్ద స్క్రీన్ లో మార్చవచ్చు .
Axon M లో రెండు వేరు వేరు 1080p ప్యానెల్స్ కలవు ఈ రెండిటినీ రెండిటినీ కలిపి 6.8 ఇంచెస్ డిస్ప్లే చేయొచ్చు . ఇది 1920 x 2160 పిక్సల్ రిజల్యూషన్ ని ఆఫర్ చేస్తుంది . ఫోన్ ఫోల్డ్ అయినప్పుడు అది ఒక సాధారణ స్మార్ట్ఫోన్ లాగా కనిపిస్తుంది.
ZTE యొక్క యాక్సోన్ M స్మార్ట్ఫోన్లకు ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది, ఎలాంటి పెద్ద డిస్ప్లే లేకుండా స్మార్ట్ఫోన్లు టాబ్లెట్ గా పని చేయవచ్చు. అదే సమయంలో ZTE కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ని కస్టమైజ్ కూడా చేయొచ్చు , ఇది ఒకే సమయంలో రెండు వేర్వేరు యాప్స్ ని డిస్ప్లే ను చూపుతుంది. దీని ద్వారా, మల్టి టాస్కింగ్ మెరుగుపరచవచ్చు మరియు టాబ్లెట్ మరియు స్మార్ట్ఫోన్ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించవచ్చు.
GSMArena రిపోర్ట్స్ ప్రకారం , Axon M 4GB ర్యామ్ , 32GB స్టోరేజ్ తో పాటు స్నాప్ డ్రాగన్ 821 తో వస్తుంది . ఈ స్మార్ట్ ఫోన్ లో 3120mAh బ్యాటరీ కలదు . మరియు దీని ధర $650 (సుమారు Rs 42,500) వరకు ఉంటుంది . Axon M వచ్చే నెల 17 తారీఖు న న్యూయార్క్ లో ఒక కార్యక్రమంలో ప్రారంభించబడుతుంది .