జోపో మొబైల్, నుంచి సరికొత్త బడ్జెట్ 4G VoLTE ఫోన్‌ విడుదల

Updated on 07-May-2017
HIGHLIGHTS

జోపో మొబైల్, నుంచి సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4G VoLTE ఫోన్‌ ఇండియన్ మార్కెట్లో విడుదల

నేటి  రోజుల్లో  చైనా కంపెనీల  ఫోన్లు  సందడి  ఎక్కువైపోతోంది.  అలావచ్చిన చైనా ఫోన్‌ల కంపెనీ జోపో మొబైల్, సరికొత్త బడ్జెట్  4G VoLTE ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 5 కలర్ వేరియంట్‌లలో  ఈ ఫోన్  వస్తుంది.  పీచ్, మాటీ వైట్, కరీబియన్ బ్లు, ఇండిగో, చార్కోల్ బ్లాక్

దీనికి 365 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ ఇస్తున్నారు  ఈ ఫోన్‌కు వారంటీ పిరియడ్‌లోపు ఏదైనా రిపేర్ వచ్చినట్లయితే జోపో సర్వీస్ సెంటర్ కొత్త ఫోన్‌ను  పొందవచ్చు. 5  ఇంచెస్  FWVGA డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 64 బిట్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, GPU, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, దీనిని  64జీబి వరకు  ఎక్స్  పాండ్  చేసుకోవచ్చు. ఇక కెమెరా  చూస్తే 5 ఎంపీ  రేర్ ఫేసింగ్ కెమెరా , 2 ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా , డ్యుయల్ సిమ్, 4జీ వోల్ట్, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ. ఫోన్ బరువు 142 గ్రాములు.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :