12,999 రూ లకు YU బ్రాండ్ నుండి 4GB ర్యామ్ తో Yunicorn స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 31-May-2016

మైక్రో మాక్స్ సబ్ బ్రాండింగ్ కొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ చేసింది ఈ రోజు ఇండియాలో. దీని పేరు Yunicorn. హై లైట్స్ ఏంటంటే 12,999 ప్రైస్,  మెటల్ బాడీ, 4GB ర్యామ్, DTS sound.

ఫోన్ లోని స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో 5.5 in FHD గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, డ్యూయల్ సిమ్  with హైబ్రిడ్ స్లాట్, ఆక్టో కోర్ మీడియా టెక్ HelioP10 SoC (4 cores 1.8GHz మరో 4 cores 1.4GHz క్లాక్ స్పీడ్ తో వస్తున్నాయి).

4GFB ర్యామ్, 13MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB sd కార్డ్ స్లాట్, 4000 mah బ్యాటరీ, usb టైప్ C పోర్ట్, రెండు వైపులా ఫుల్ మెటల్ బాడీ, two స్పీకర్ గ్రిల్స్ on బాటం.

ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 4G LTE, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ హోమ్ బటన్,  5 ఫింగర్ ప్రింట్స్ storage, ఆండ్రాయిడ్ 5.1 OS(ఒక నెలలో ఆండ్రాయిడ్ M అప్ డేట్ ఇస్తుంది అని ప్రామిస్ చేసింది కంపెని).

ఫోన్ flipkart లో 12,999 రూ లకు జూన్ 7 న ఫ్లాష్ సెల్ అవనుంది. ఈ రోజు 2PM నుండి రిజిస్ట్రేషన్స్ మొదలు. మొదటి ఫ్లాష్ సేల్స్ లో కొనే వారికీ SBI 10 పెర్సెంట్ క్యాష్ బ్యాక్ తో పాటు Yu Wallet లో 400 రూ ఇస్తుంది కంపెని. 

కంపెని ఫోన్ తో పాటు wallet ఇస్తుంది. అలాగే మొదటి నెల మాత్రమే ఫ్లిప్ కార్ట్ లో 12,999 రూ లకు సెల్, ఆ తరువాత 14,999 రూ లకు సెల్ అవుతుంది. అయితే మొదటి నెలలో ఎన్ని ఫ్లాష్ సేల్స్ అవుతాయి అనే విషయం ఇంకా వెల్లడించలేదు కంపెని.

క్యాబ్స్ అండ్ అరౌండ్ సర్వీసెస్ ను అందించే AROUND సాఫ్ట్ వేర్ సెకెండ్ వెర్షన్ 2.0 ను కూడా రిలీజ్ చేసింది YU televentures.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :