Yu యురేకా ప్లస్ ధర 1000 రూ తగ్గింది
మైక్రోమ్యాక్స్ యు బ్రాండింగ్ నుండి రెండు వారల క్రితం 9,999 రూ లకు యురేకా ప్లస్ ను లాంచ్ చేసింది. ఈ ధరకు మంచి స్పెక్స్ మరియు ఆఫర్స్ ను ఇచ్చింది. అయితే దీనిని కొనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళకి ఇప్పుడు గుడ్ న్యూస్.
యు యురేకా ప్లస్ ఇప్పుడు అఫిషియల్ గా పర్మనెంట్ గా 1000 రూ తగ్గింది. అంటే 8,999 రూ యురేకా plus అమెజాన్ లో కొనగలరు. ఆగస్ట్ 6 వ తేదిన 12.00PM కు సేల్ అవుతుంది. దీని కోసం registration చేసుకోవాలి. ఈ లింక్ లో మీరు అమెజాన్ వెబ్ సైటు లో registration చేసుకోగలరు.
అసలు యురేకా కు యురేకా plus కు ఉన్న తేడాలు ఏంటి?
యురేకా ప్లస్ – 400 PPI డిస్ప్లే, 1920 x 1080 పిక్సెల్స్ రిసల్యుషణ్, సోనీ IMX 214 కెమేరా సెన్సార్.
యురేకా – 267 PPi, 1280 x 720 రిసల్యుషణ్, సోనీ IMX 135 కెమేరా సెన్సార్,
యురేకా ప్లస్ స్పెక్స్ – 5.5 in కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్క్రీన్, 2GB ర్యామ్, 1.5 GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, 13MP మరియు 5MP కేమేరాస్, 16GB స్టోరేజ్, లాలిపాప్ 5.0.2 బేస్డ్ CM 12 OS.
మార్కెట్ లో కాంపిటీషన్ పెరగటంతో యూజర్స్ కు తమ బ్రాండ్ మొబైల్ ను కొనేందుకు ఎక్కువ కారణాలు చూపించటం మొదలు పెడుతున్నాయి కంపెనీలు. ప్రైస్ కట్స్ ద్వారా compromise అయ్యి యూజర్స్ ను satisfy చేయటానికి దాదాపు అన్ని బ్రాండ్స్ మొగ్గు చూపుతున్నాయి.
లెనోవో K3 నోట్, మోటో G2, వంటి డివైజ్ లు 10 వేల రూ లకు దొరకటం తో యురేకా ప్లస్ ఈ ప్రైస్ కట్ తో వచ్చింది అని అనుకోవాలి.