Yu బ్రాండ్ నుండి rugged స్మార్ట్ ఫోన్ వస్తుంది అని ఈ రోజు చెప్పటం జరిగింది. అయితే అది మరేదో కాదు యురేకా ప్లస్ అని అనిపిస్తుంది. గతంలో లాంచ్ అయిన యురేకా మోడల్ కు ఇది అప్ గ్రేడ్ మోడల్.
యు యురేకా ప్లస్ Key స్పెక్స్ – స్నాప్ డ్రాగన్ 615 SoC, 13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా. యురేకా లో సోని IMX135 సెన్సార్ వాడారు బ్యాక్ కెమేరా కు. ఇప్పుడు యురేకా ప్లస్ లో IMX214 సెన్సార్ వాడటం జరిగింది.
డిస్ప్లే రిసల్యుషణ్ ఫుల్ HD కు అప్ గ్రేడ్ అయ్యింది. సైజ్ మాత్రం సేం 5.5 inches. ఇందులో కూడా మొదటి మోడల్ వలె 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ మరియు 4G(TDD and FDD LTE bands). బ్యాటరీ 2,500 mah.
Yu యురేకా ప్లస్ అమెజాన్ లో ఈ నెల 24 నుండి ఫ్లాష్ సేల్ ద్వారా అమ్మకాలు ప్రారంభించనుంది. దానిని 24 న కొనే ఉద్దేశం ఉన్న వాళ్లు కచ్చితంగా మరిచిపోకుండా అలారం పెట్టుకొని 21 న మొదలయ్యే రిజిస్ట్రేషన్లు లో రిజస్టార్ అవ్వండి. దీని ధర 9,999 రూ. అయితే టీజర్ ప్రకారం ఇది చాలా రఫ్ గా వాడుకోవచ్చు అని స్పష్టం చేసింది కంపెని.