Yu Yureka Black స్మార్ట్ ఫోన్ ని కంపెనీ ఈరోజు భారత్ లో లాంచ్ చేసింది

Updated on 02-Jun-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్ బ్లాక్ మరియు మెట్ బ్లాక్ ఫినిష్ తో ఇంట్రడ్యూస్ అయింది

Yu Yureka Black  స్మార్ట్ ఫోన్ ని కంపెనీ  ఈరోజు   భారత్  లో లాంచ్ చేసింది .  ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్  బ్లాక్ మరియు మెట్  బ్లాక్ ఫినిష్  తో ఇంట్రడ్యూస్  అయింది .  దీని ధర  Rs 8,999 . Yu Yureka Black 6  జూన్ రాత్రి నుంచి  ఫ్లిప్కార్ట్ లో దీని సేల్స్ మొదలవుతాయి .
ఈ స్మార్ట్ ఫోన్ కి మెటల్  బాడీ   వెనుకవైపు గ్లాస్ పొందుపరిచారు.  దీని యొక్క తిక్నెస్   8.55mm , మరియు బరువు 142 గ్రాములు . ఈ స్మార్ట్ ఫోన్ లో జేశ్చర్  సపోర్ట్ కూడా కలదు , దీని ద్వారా మీరు యాప్స్  ఓపెన్ చేయవచ్చు.  కాల్స్  చేసుకోవచ్చు , sms  కూడా చేసుకోవచ్చు .
ఇక దీని స్పెక్స్  గమనిస్తే  5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  కలిగి రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ దీనిలో  2.5D  కార్నింగ్ గొరిల్లా గ్లాస్   3  ప్రొటెక్షన్ కూడా కలదు.  క్వాల్ కామ్  స్నాప్  డ్రాగన్  430  ప్రోసెసర్  కలదు మరియు 4GB  RAM  అండ్  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  గలదు , స్టోరేజ్  ని మైక్రో sd  ద్వారా  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .ఇక కెమెరా  గమనిస్తే 13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ .  ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  ఇచ్చారు. 
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  6.0.1 మార్షమేల్లౌ  ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుంది.  3000mA  బ్యాటరీ  కలిగి వుంది .  4G VoLTE  సపోర్ట్ తో వస్తుంది . దీనిలో డ్యూయల్ సిమ్  సపోర్ట్ కూడా కలదు. 

Connect On :