Rs.6999 యు యుఫోరియా మరియు Rs.999 కు యు ఫిట్

Rs.6999 యు యుఫోరియా మరియు Rs.999 కు యు ఫిట్
HIGHLIGHTS

మైక్రోమ్యాక్స్ తమ తదుపరి యు మోడల్, యుఫోరియా ను అధికారికంగా భారతదేశం లో విడుదల చేసింది.

మైక్రోమ్యాక్స్ భారతదేశంలో యు యుఫోరియా(Yu Yuphoria) స్మార్ట్ఫోన్ అధికారికంగా  విడుదల చేసింది. రూ . 6999 ధరకే ఈ ఫోన్ అమెజాన్ లో దొరుకుతుంది. ఈ ఫోన్ ను కొనటానికి అమెజాన్ లో రిజిస్ట్రేషన్లు మే12 నుండి మొదలు అయ్యాయి. దీనితో పాటు మైక్రోమ్యాక్స్, యు-ఫిట్ (YuFit) అనే కొత్త ఫిట్నెస్ బ్యాండ్ లాంచ్ చేసింది.

యు యురేకా తరువాతి మోడల్ గా వస్తున్న యు యుఫోరియా 5 ఇంచ్ 720P గొరిల్లా గ్లాస్  డిస్ప్లే (TFT IPS, 16.7M Color, 294 PPI) మరియు మెటల్ బాడీ తో వస్తుంది. ఇండియాలో తాయారుబడిన ఈ ఫోన్ 8.25mm సన్నగా మరియు 143 గ్రా బరువును కలిగి ఉంది. యుఫోరియా స్క్రీన్ నుండి టచ్ ప్యానల్ రేషియో 75 శాతం ఉంది.

స్నాప్డ్రాగెన్ 410 1.2GHz క్లాక్ స్పీడ్  64-బిట్ SoC తో పాటు 2GB రామ్ ను ఇందులో జోడించారు. 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు 
f/2.0 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ తో  5MP ఫ్రంట్ కెమేరా యుఫోరియలో ఉన్నాయి. ఇది 16GB ఇంటర్నల్ మెమరీ మరియు 32GB ఎక్స్పెండబల్ మెమరీ తో లభిస్తుంది. యుఫోరియా ఫోన్ ఆండ్రాయిడ్ ఆదారిత సయానోజన్ OS 12 మీద పనిచేస్తుంది.  4G LTE సపోర్ట్ ఉన్న యుఫోరియా 2230mah బ్యాటరీ  మీద నడుస్తుంది.

యూత్ ను టార్గెట్ చేసుకొని ఆకర్షణీయమైన ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తో యు యుఫోరియా ప్రస్తుతానికి సామ్సంగ్ A3 మరియు HTC డిజైర్ 620 లకు గట్టి పోటీ ఇస్తుంది.

Xiaomi కి పోటీగా మైక్రోమ్యాక్స్ యు-ఫిట్ (YuFit) అనే కొత్త ఫిట్నెస్ బ్యాండ్ కూడా ప్రారంభించింది. OLED డిస్ప్లే కలిగి ఉన్న ఈ బాండ్ శరీరంలోని కేలరీలు, నిద్ర మరియు నడిచే అడుగులను ట్రాక్ చేయటమే కాకుండా ఫోన్ కు వచ్చే కాల్స్ మరియు మెసేజ్ల నోటిఫికేషన్లు తెరపై చూపిస్తుంది. 'HealthifyMe.com' అనే వెబ్సైట్ తో అనుసంధానం అయ్యే యు ఫిట్ బాండ్ మొదటి 1000 యు-ఫిట్ కొనుగోలుదారులకి పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్ ను ఇస్తున్నట్లు ప్రకటించింది మైక్రోమ్యాక్స్. రూ. 999 ధరకే లభించనున్నయు-ఫిట్ బాండ్ ఒక్క నోటిఫికేషన్లు ఫీచర్ కారణంగా కచ్చితంగా Xiaomi mi బాండ్ మీద పై చేయి సాధించింది.

ఈ రెండు డివైజ్ లతో పాటు మైక్రోమ్యాక్స్ హెల్త్-యు (HealthYU) ను ప్రకటించింది. ఇది ECG, బిపి, ఉష్ణోగ్రత, శ్వాస వంటివి మానిటర్ చేస్తుంది. హెల్త్-యు అని పిలుస్తున్న ఈ పరికరం ధర రూ.4,999.

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo