నిన్న సాయింత్రం మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ YU నుండి కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. 4,999 రూ ఉన్న దీని పేరు YU Yunique. స్నాప్ డీల్ లో ఫ్లాష్ సేల్స్ ద్వారా సేల్ అవుతుంది. రిజిస్ట్రేషన్లు కోసం ఈ లింక్ లోకి వెళ్లండి. సెప్టెంబర్ 12 న సేల్ అవుతుంది.
స్పెసిఫికేషన్స్ – 4.7 in 720Pకార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే. 1.2 GHz స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్, 1gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ అండ్ 32 gb అదనపు sd కార్డ్ సపోర్ట్, 4G
8MP omnivision f/2.0 కెమేరా, 2MP 83 డిగ్రీ ఫ్రంట్ కెమేరా, 2000 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ. YU బ్రాండ్ నుండి ఇప్పటివరకూ వచ్చిన ఫోన్ లన్నీ cyanogen OS పై రన్ అవుతున్నాయి. ఇది మాత్రం స్టాక్ (ఒరిజినల్) ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్ os పై రన్ అవుతుంది.
దీనిని రోటింగ్ చేసినా, cyanogen os 12.1 దీనిలో ఫ్లాష్ (ఇంస్టాల్) చేసిన కంపెని వారెంటీ ను ఇస్తుంది అని అనౌన్స్ చేసింది. అదనంగా 2 బ్యాక్ కలర్ ప్యానల్స్ తో Yunique 5,499 రూ లకు కూడా కొనవచ్చు.
ఈ ఫోన్ తో పాటు YU5050 అండ్ YU4711 పేర్లతో ఉన్న మోడల్స్ లీక్ అయ్యాయి. గీక్ బెంచ్ లో లీక్ అయిన స్పెసిఫికేషన్స్ ద్వారా YU5050 లో ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 810 ప్రొసెసర్, 5.2 in 1080P డిస్ప్లే, 4gb ర్యామ్ అని రిపోర్ట్స్. అయితే నిన్న జరిగిన Yunique లాంచ్ ఈవెంట్ లో కంపెని YU5050 పై ఎటువంటి మాట కూడా మాట్లాడలేదు.
Buy Yu Yunique at Rs. 4,999 on Snapdeal