మైక్రోమాక్స్ సబ్ బ్రాండ్ YU మరో డివైజ్ తో మార్కెట్ లోకి రానుంది త్వరలో. ఈ ఫోన్ కు సంబంధించి teaser వీడియో ఒకటి రిలీజ్ చేసింది.
ప్రతీ సారి లానే ఈ సారి కూడా కంపెని ‘Redefining Flagship’ అనే పెద్ద మార్కెటింగ్ తో మొదలు పెట్టింది రాబోయే డివైజ్ యొక్క ప్రొమోషన్స్.
ఫోన్ డిటేల్స్ ఏమీ క్లూ కూడా తెలియటం లేదు కాని ఫోన్ మాత్రం ఫ్లాగ్ షిప్ రేంజ్ లో ఉండనుంది అని టాగ్ లైన్ ద్వారా స్పష్టం అవుతుంది.
అయితే ఫ్లాగ్ షిప్ ఫోన్ కు ప్రైస్ కూడా ఫ్లాగ్ షిప్ రేంజ్ లోనే ఉండవచ్చు. ఫ్లాగ్ షిప్ అంటే కంపెని యొక్క high end (పవర్ ఫుల్) స్పెసిఫికేషన్స్ కలిగిన ఫోన్ అని అర్థం.
ఫోన్ MAY 2016 లో లాంచ్ అవనుంది. లుక్స్ వైజ్ గా మరియు స్పెక్స్ వైజ్ గా చాలా బ్యూటిఫుల్ మరియు పవర్ ఫుల్ గా ఉంటుంది ఫోన్ అని చెబుతున్నారు కంపెని కో ఫౌండర్ రాహుల్.
గతంలో కంపెని YU Yutopia అనే ఫ్లాగ్ షిప్ ఫోన్ ను 25 వేల బడ్జెట్ లో లాంచ్ చేసింది. attempt బాగుంది కాని పెర్ఫార్మన్స్ మరియు ఇతర ఓవర్ ఆల్ విషయాలలో ఫోన్ మార్కులు సంపాదించుకోలేకపోయింది.
రీసెంట్ కంపెని 13,499 రూ లకు YU యురేకా నోట్ పేరుతొ phablet డివైజ్ లాంక్ చేసింది. ఇది 6 in డిస్ప్లే, ఆక్టో కోర్ మీడియా టెక్ SoC, 3GB ర్యామ్ తో వస్తుంది.